Hanuman Birthplace: టీటీడీది అర్థజ్ఞానం అంటూ విమర్శించిన గోవిందానంద

Hanuman Birthplace: హనుమంతుడి జన్మస్థల వివాదం మరింత పీక్స్‌కు చేరుకుంది.

Update: 2021-05-28 14:48 GMT

Hanuman(Thehansindia)

Hanuman Birthplace: హనుమంతుడి జన్మస్థల వివాదం మరింత పీక్స్‌కు చేరుకుంది. నిన్నటి సమావేశం అసంపూర్ణంగా ముగిసిపోవడంతో టీటీడీ కమిటీ, కిష్కింధ ట్రస్ట్ మధ్య మాటల మంటలు రాజుకున్నాయి. సమావేశం అనంతరం గోవిందానంద టీటీడీపై ప్రశ్నలు సంధిస్తే.. అదేస్థాయిలో టీటీడీ కౌంటర్ ఇచ్చింది. దీంతో ఇవాళ మరోసారి గోవిందానంద టీటీడీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

హనుమాన్ జన్మస్థలం వివాదంపై టీటీడీ కమిటీ, కిష్కింధ ట్రస్ట్ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. నిన్న గోవిందానంద కామెంట్స్‌పై కౌంటర్ ఇచ్చిన టీటీడీకి మళ్లీ గోవిందానంద రివర్స్ కౌంటర్ ఇచ్చారు. సంస్కృతంలో అక్షరం ముక్క రాదంటూ టీటీడీ కమిటీ చేసిన కామెంట్స్‌పై.. అర్థజ్ఞానం అంటూ ఫైర్ అయ్యారు గోవిందానంద. దీంతో హనుమాన్ జన్మస్థల వివాదం మరింత పీక్స్‌కు చేరుకుంది.

హనుమాన్ జన్మస్థలానానికి సంబంధించి టీటీడీ పుస్తకంలో అన్నీ తప్పులేనని గోవిందానంద విమర్శించారు. సంపూర్ణ అవగాహన, పరిశోధన చేయకుండా హనుమంతుడి జన్మస్థలాన్ని అసంపూర్ణ జ్ఞానంతో ప్రకటించారని తప్పుబట్టారు. టీటీడీ ప్రమాణంగా చూపిస్తున్న.. వెంకటాచలం మహత్యం సంకలనం తప్పుల తడక అని కొట్టిపారేశారు. వెంకటాచలం మహత్యం బుర్రలేని వారు రాశారని మండిపడ్డారు. ద్వాపరయుగం అంతంలో 5 వేల ఏళ్ల క్రితం పురాణాలు పుట్టాయని, టీటీడీ రామాయణాన్ని ప్రమాణంగా తీసుకోవడం లేదని గోవిందానంద విమర్శించారు.

కలియుగంలో హనుమంతుడు పుట్టినట్టు టీటీడీ పుస్తకం చెబుతోందని, టీటీడీ ప్రకారం హనుమంతుడు రాక్షసుడు.. రామాయణం ప్రకారం అప్సరస బిడ్డ అని తెలిపారు. అంజన హళ్లి ఇంకా పంపా సరోవరం వద్ద ఉందని పేర్కొన్నారు. రామాయణంలో ఎక్కడా తిరుమల గురించి వృషాద్రి, శేషాద్రి పర్వతాలు లేవని చెప్పారు. కొందరు కీర్తి కోసం వత్తిడితో హనుమంతుడి జన్మస్థలాన్ని.. పండితుల చేత రిలీజ్ చేయించారని గోవిందానంద ఆరోపించారు.

టీటీడీ వెనక్కు తగ్గడం లేదు.. కిష్కింధ ట్రస్ట్ ససేమిరా అంటుంది. ఈ పరిస్థితులకు తోడు రెండు వర్గాల కౌంటర్ కామెంట్స్‌తో హనుమాన్ జన్మస్థల వివాదం మరింత ముదురుతున్నట్లు కనిపిస్తోంది.

Tags:    

Similar News