Hanuman Birth Place: చిలికి చిలికి గాలివానలా హనుమాన్‌ జన్మస్థల వివాదం

Hanuman Birth Place: హనుమాన్‌ జన్మస్థల వివాదం చిలికి చిలికి గాలివానలా మారింది.

Update: 2021-05-28 07:23 GMT

Hanuman Birth Place: చిలికి చిలికి గాలివానలా హనుమాన్‌ జన్మస్థల వివాదం

Hanuman Birth Place: హనుమాన్‌ జన్మస్థల వివాదం చిలికి చిలికి గాలివానలా మారింది. నిన్న టీటీడీ, కిష్కింధ ట్రస్ట్‌ మధ్య జరిగిన చర్చల్లో ఎలాంటి క్లారిటీ రాలేదు. కిష్కింధ ట్రస్టీ శ్రీ గోవిందానంద సరస్వతికి అసలు జ్ఞానమేలేదని అంటోంది టీటీడీ. గోవిందానందకు ‌వేద పరిజ్ఞానం లేదని సంస్కృతం రాదని ఆరోపించింది. అంజనాద్రి కొండపై ఉన్న జాపాలి తీర్థమే హనుమాన్‌ జన్మస్థలమంటూ టీటీడీ మరోసారి ధీటుగా సమాధాన మిచ్చింది.

ఇక టీటీడీ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించారు కిష్కింధ ట్రస్టీ శ్రీగోవిందానంద సరస్వతి. టీటీడీ న్యాయబద్ధంగా వ్యవహరించడంలేదని, హనుమాన్‌ ఇక్కడే పుట్టాడని టీటీడీ చెబుతోందని, కానీ ఎక్కడ పుట్టాడో చెప్పడంలేదని ఆరోపించారు. హనుమాన్‌ జన్మస్థలంపై టీటీడీ దగ్గర ఉన్న ఆధారాలను తమకు సమర్పిస్తే వాటిని క్షుణ్ణంగా పరిశీలిస్తామని చెప్పారు. వ్యాకరణాన్ని టీటీడీ సరిగా అర్థం చేసుకోవాలన్న గోవిందానంద హనుమాన్‌ జన్మస్థలంపై బహిరంగ చర్చ జరగాలన్నారు.

Tags:    

Similar News