అట్టహాసంగా క్రిస్మస్ వేడుకలు
ప్రత్యేక ప్రార్థనలతో చర్చిల్లో అధ్యాత్మిక వాతావరణం కనిపిస్తోంది.
గుంటూరులో క్రిస్మస్ వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. క్రీస్తు స్మరణలతో, ప్రత్యేక ప్రార్థనలతో చర్చిల్లో అధ్యాత్మిక వాతావరణం కనిపిస్తోంది.
రాష్ట్రంలో క్రిస్మస్ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. చర్చిలన్నీ రంగురంగుల విద్యుత్తు దీపాలతో సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి. అర్ధరాత్రి నుంచే క్రీస్తు ఆలయాల్లో ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. దేవదూతగా శాంతాక్లాజ్ క బహుమతులు ఇచ్చి ఆశీర్వచనాలు అందజేస్తున్నారు. క్రిస్మస్ పర్వదినం సందర్భంగా గుంటూరు లోని పలు చర్చిల్లో విద్యుత్తు దీపాలతో అలంకరించారు. క్రీస్తు జననాన్ని తెలియజేసేలా చర్చిల్లో బొమ్మలు ఏర్పాటు చేశారు. ప్రత్యేక ప్రార్థనలు చేసి, క్రీస్తు గీతాలను ఆలపించారు