TTD: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. శ్రీవాణి బ్రేక్ దర్శన టికెట్ల జనవరి కోటా విడుదల
TTD: తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్. జనవరికి సంబంధించిన దర్శనం, వసతి కోటా టోకెన్లను టీటీడీ నేడు విడుదల చేయనుంది. అదే విధంగా దాతలకు సంబంధించిన కోటాను కూడా నేడు అందుబాటులో ఉంచుతుంది. తిరుమలకు చేరుకుంటున్న భక్తులకు 6గంటల్లోనే శ్రీవారి దర్శనం అందుతుంది. కార్తీక మాసం ప్రారంభం వేళ..తిరుమలలోని ఆలయాలకు వచ్చే భక్తుల రద్దీని పరిగణలోనికి తీసుకుని ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది టీటీడీ.

తిరుమలలో స్వామివారిని బుధవారం 64,359 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. 20,711 మంది తలనీలాలు సమర్పించారు. భక్తులు సమర్పించిన మొక్కుల ద్వారా శ్రీవారి హుండీకి రూ. 3.59కోట్ల ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు.
టీటీడీ నిర్వహిస్తున్న పలు ట్రస్టులు, పథకాలతోపాటు శ్రీవేంకటేశ్వర ఆపన్న హృదయ పథకానికి విరాళం ఇచ్చిన దాతలకు సంబంధించిన దర్శనాలు, వసతి గదులు 2025 జనవరి నెల కోటాను అక్టోబర్ 24వ తేదీ ఉదయం 11.30 గంటలకు టీటీడీ రిలీజ్ చేయనుంది.
జనవరి నెలకు సంబంధించిన ప్రత్యేక దర్శనం రూ. 300టికెట్లను కోటాను నేడు ఉదయం 10గంటలకు టీటీడీ ఆన్ లైన్ లో రిలీజ్ చేస్తుంది. తిరుమల, తిరుపతిలలో జనవరి నెల గదుల కోటాను నేడు మధ్యాహ్నం 3గంటలకు ఆన్ లైన్లో రిలీజ్ చేస్తారు.
తిరుమల శ్రీవారి భక్తులు ttps://ttdevasthanams.ap.gov.in వెబ్ సైట్లో ఆర్జిత సేవలు, దర్శన టికెట్లు, వసతి గదులను బుక్ చేసుకోవాలని టీటీడీ అధికారులు సూచించారు.
అటు శ్రీవాణి బ్రేక్ దర్శన కోటా టికెట్లు 2025 జనవరి నెల కోటాను బుధవారం టీటీడీ విడుదల చేసింది. రోజుకు 500 టికెట్లు, 100 గదులు అందుబాటులో ఉంటాయి. 2025 జనవరి 10 నుంచి 19వ తేదీ వరకు వైకుంఠ ఏకాదశి సందర్భంగా టికెట్ల విడుదలను వాయిదా వేశామని టీటీడీ అధికారులు తెలిపారు.
భక్తులు గమనించి ఆ తేదీలను మినహాయించి ఆన్ లైన్లో టికెట్లను బుక్ చేసుకోవాలని కోరారు. తిరుపతి శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయానికి రానున్న కార్తీక మాసంలో విశేష సంఖ్యలో విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని టీటీడీ ఈవో అధికారులను ఆదేశించారు.