Srisailam: శ్రీశైలంలో ఘనంగా గిరిప్రదక్షిణ
Srisailam: మహా మంగళహారతుల తర్వాత శ్రీశైలం కొండ చుట్టూ ప్రదక్షిణలు
Srisailam: పుష్య శుద్ధ పౌర్ణమిని పురష్కరించుకొని భ్రమరాంబికా మల్లికార్జున స్వామి కొలువైన ఉన్న శ్రీశైలంలో గిరిప్రదక్షిణ కార్యక్రమం శాస్త్రోక్తంగా జరిగింది. మహ మంగళహరతుల అనంతరం స్వామి అమ్మవారి ఉత్సవమూర్తులను పల్లకిలో ఆశీనులను చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామి అమ్మవార్ల పల్లకి ఊరేగింపుతో గిరిప్రదక్షణ కార్యక్రమాన్ని ఆలయ ఈవో లవన్న, అర్చకులు ప్రారంభించారు. రాజగోపురం నుంచి గిరిప్రదక్షిణ ప్రారంభమై గంగాధర మండపం, ఆంకాళమ్మ ఆలయం, నంది మండపం, గంగా సదనము, బయలు వీరభద్రస్వామి ఆలయం, పంచమఠాలు, మల్లమ్మ కన్నీరు పుష్కరిణి వద్దకు చేరుకొని తిరిగి నంది మండపం మీదుగా ఆలయ మహాద్వారం చేరుకోవడంతో శ్రీశైల గిరిప్రదక్షిణ కార్యక్రమం ముగిసింది. ఈ గిరిప్రదక్షిణలో ఆలయ అధికారులు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.