పోలవరం పూర్తి చేయడానికి సంపూర్ణ సహకారం అందిస్తాం - షెకావత్

Gajendra Singh Shekhawat: పోలవరాన్ని పూర్తి చేసేందుకు అన్ని విధాలా సంపూర్ణ సహకారం అందిస్తామన్నారు గజేంద్ర సింగ్ షెకావత్.

Update: 2022-03-05 02:18 GMT

పోలవరం పూర్తి చేయడానికి సంపూర్ణ సహకారం అందిస్తాం - షెకావత్

Gajendra Singh Shekhawat: పోలవరాన్ని పూర్తి చేసేందుకు అన్ని విధాలా రాష్ట్ర ప్రభుత్వానికి సంపూర్ణ సహకారం అందిస్తామన్నారు కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్. ప్రాజెక్టు నిర్మాణంపై 15 రోజులకు ఓసారి చొప్పున మూడు నెలలపాటు సమీక్షిస్తే.. ప్రాజెక్టు శరవేగంగా పూర్తి చేయడానికి మార్గం సుగమమవుతుందని సీఎం జగన్ చేసిన సూచనలపై సానుకూలంగా స్పందించారు షెకావత్.

సీడబ్ల్యూసీ, పీపీఏ, రాష్ట్ర జలవనరుల శాఖ ఉన్నతాధికారులతో 15 రోజులకు ఒకసారి ప్రాజెక్టు నిర్మాణ ప్రక్రియ అంశాలపై సమీక్షించి, సమస్యలు పరిష్కరించి నివేదిక ఇవ్వాలని కేంద్ర జల్ శక్తి శాఖ సలహాదారు శ్రీరాంను షెకావత్ ఆదేశించారు. పోలవరం ప్రాజెక్టు పనుల ప్రగతిపై ప్రత్యేక డాష్ బోర్డును ఏర్పాటు చేయాలన్నారు. దాని ద్వారా పనుల పురోగతిని ఎప్పటికప్పుడు తెలుసుకుని, పనుల్లో వేగం పెంచడానికి చర్యలు చేపట్టవచ్చని అధికారులకు దిశానిర్దేశం చేశారు.

సీఎం జగన్ తో కలిసి తూర్పుగోదావరి జిల్లా ఇందుకూరు, పశ్చిమగోదావరి జిల్లా తాడ్వాయి వద్ద నిర్మించిన పునరావాస కాలనీలు పరిశీలించారు షెకావత్. ప్రాజెక్టు నిర్వాసితులకు పునరావాస ప్యాకేజీ కింద చెల్లించాల్సిన నగదు పరిహారాన్ని డీబీటీ విధానంలో వారి ఖాతాల్లో జమ చేయాలని సీఎం జగన్ చేసిన ప్రతిపాదనపై వెంటనే చర్యలు చేపట్టాలని కేంద్ర మంత్రి జల్ శక్తి శాఖ అధికారులను ఆదేశించారు.

Tags:    

Similar News