AP Secretariat : ఏపీ సచివాలయంలో కొద్ది రోజుల నుంచి ఘరానా మోసాలు జరుగుతున్నాయి. ఉద్యోగాల పేరుతో కొంత మంది వ్యక్తులు నిరుద్యోగుల నుంచి డబ్బులను కాజేస్తున్నారు. పౌర సరఫరాల శాఖలో డేటా ఎంట్రీ ఉద్యోగం పేరుతో మోసానికి పాల్పడుతున్నారు. సివిల్ సప్లయ్స్ అండ్ కన్స్యూమర్ అఫైర్స్ ఆఫీసులో ఉద్యోగం పేరుతో ఫేక్ అపాయింట్ మెంట్ లెటర్ ఇచ్చి ఏగయ్య అనే యువకుడి వద్ద 3,30,000 వసూలు చేసింది ఘరానా ముఠా. ఈ ముఠాలో ఉన్న అటెండర్ సతీష్ వర్మ మంత్రి కొడాలి నాని ఓఎస్డీ పేరుతో బాదితునికి నకిలీ అపాయింట్ మెంట్ ఇచ్చాడు. అంతే కాదు సతీష్ వర్మ ఉద్యోగం ఇవ్వాలంటూ సివిల్ సప్లై శాఖ అధికారికి నకిలీ పత్రాలు కూడా పంపించాడు.
ఈ గూడుపుఠానీలో అటెండర్ సతీష్ వర్మ తో పాటు గుంటూరులోని వార్డు సచివాలయంలో వాలంటీర్ గా పని చేస్తున్న సౌజన్య అనే యువతి , మరో ముగ్గురూ తన వద్ద ఉద్యోగం పేరుతో 3,30,000 వసూలు చేసారని తుళ్లూరు పియస్ లో ఫిర్యాదు. మంత్రి పీయస్ లెటర్ ప్యాడ్, స్టాంప్ వేసి అపాయింట్ మెంట్ లెటర్ ను ఇచ్చారు. లెటర్ ను తీసుకున్న బాధితుడు అపాయింట్ లెటర్ ను తీసుకుని సచివాలయం వచ్చి జాబ్ కోసం విచారించాడు. దాంతో అది ఫేక్ లెటర్ అని మంత్రి పేషీ నుండి సమాధానం రావడంతో మోసపోయానని గ్రహించి స్టేషన్ లో పిర్యాదు చేసాడు బాధితుడు. దీంతో తుళ్లూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.