అంతర్వేది ఘటనపై మాజీ ఎంపీ హర్షకుమార్ సంచలన వ్యాఖ్యలు

Update: 2020-09-11 08:40 GMT

అంతర్వేది రథం దగ్ధం ఘటనపై మాజీ ఎంపీ హర్షకుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతర్వేది ఆలయం రాజోలు నియోజకవర్గంలో ఉందని.. అక్కడ జనసేన రెబల్ ఎమ్మెల్యే ఉండటం వల్లే జనసేన, బీజేపీలు ఈ ఘటనని రాజకీయం చేస్తున్నాయని వ్యాఖ్యానించారు. ఆర్.ఎస్.ఎస్ ద్వారా రాజోలు నియోజవర్గంలో కాపు కులాన్ని రెచ్చగొడుతున్నారని బీజేపీ మతాభిమానంతో, జనసేన కులాభిమానంతో కుళ్లిపోయాయని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుకి కులాభిమానం ఎక్కువని చిరంజీవిని సీఎం చేయాలనేది ఆయన లక్ష్యమని చిరంజీవి కుటుంబానికి సోము వీర్రాజు హనుమంతుడిలా మారారన్నారు. దళిత యువకుడికి శిరోముండనం చేయిస్తే సీబీఐతో విచారణ ఎందుకు చేయించడం లేదని ప్రశ్నించారు. సీఎం జగన్ ఒక్కో కులానికీ, మతానికీ ఒక్కోలా నిర్ణయాలు తీసుకుంటున్నారని దుయ్యబట్టారు. సీఎం జగన్‌కు దళితులపై చిత్తశుద్ధి ఉంటే ఇకనైనా సీతానగరం శిరోముండనం ఘటనపై కూడా సీబీఐ విచారణ జరిపించాలి హర్షకుమార్ డిమాండ్ చేశారు.



Tags:    

Similar News