Gudivada: కులాలు గురించి మాట్లాడే ముఖ్యమంత్రి చరిత్రలో ఎవరూ లేరు

ఎంతవరకు కులాలు గూర్చి ఏ ముఖ్యమంత్రి మాట్లాడలేదని ఎన్నికల నిర్వహించకపోతే కులాలు మతాలు పేర్లు చెప్పి ప్రజలను ఆందోళనకు గురి చేసిన ఏకైక వ్యక్తిగా జగన్ నిలిచిపోతారని మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు వైకాపా పై విమర్శలు చేశారు.

Update: 2020-03-17 02:53 GMT

గుడివాడ:ఎంతవరకు కులాలు గూర్చి ఏ ముఖ్యమంత్రి మాట్లాడలేదని ఎన్నికల నిర్వహించకపోతే కులాలు మతాలు పేర్లు చెప్పి ప్రజలను ఆందోళనకు గురి చేసిన ఏకైక వ్యక్తిగా జగన్ నిలిచిపోతారని మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు వైకాపా పై విమర్శలు చేశారు.
 

స్థానిక టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత పది రోజులుగా అధికార పార్టీ నాయకులు ఎన్నికల నామినేషన్లు వేసే సమయంలో ఎలాంటి దాడులకు పాల్పడ్డారు అందరికీ తెలుసు అన్నారు. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ ముఖ్యమంత్రి పిచ్చి గా మాట్లాడటం ఆయన వివేకానికి నిదర్శనమన్నారు.147 దేశాల్లో ఒక లక్షా 40వేల మంది కరుణ వ్యాధి బారిన పడటం జరిగిందని అందులో 5,500 మంది చనిపోవడం జరిగిందన్నారు. కరుణ వ్యాధి ఎక్కువగా ఉన్న చైనా మొదటి స్థానంలో ఉంటే భారతదేశం 42వ స్థానంలో ఉందన్నారు. ఈ వైరస్ ఉంది ప్రజలను కాపాడాలని కేంద్రం కరుణ పై జాతీయ విపత్తుగా ప్రకటించడంతో మన రాష్ట్రంలో ఎన్నికలు వాయిదా వేయడం జరిగింది అన్నారు.

దీనిపై ముఖ్యమంత్రి ఏ విధంగా స్పందించారో ప్రతి ఒక్కరికీ తెలుసన్నారు. ముఖ్యమంత్రి జగన్ కాలికి చిన్న దెబ్బ తగిలితే అమ్మా అనడానికి బదులు కమ్మ అని అంటారని వ్యంగ్యంగా విమర్శించారు.రాష్ట్రంలో మళ్లీ ఎన్నికల నిర్వహించాలంటే మళ్లీ నోటిఫికేషన్ విడుదల చేయాలని ఏకగ్రీవం అయిన వారితో సహా అన్ని రద్దుచేసి ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు కామినేని శ్రీ కృష్ణ ప్రసాద్, డి రాంబాబు, వాసి మురళి, పి. సాంబశి వరావు, దేవరపల్లి కోటి, షేక్ సర్కార్ తదితరులు పాల్గొన్నారు. 

Tags:    

Similar News