West Godavari:పశ్చిమగోదావరి జిల్లాలో మంచు దుప్పటి

West Godavari: పశ్చిమగోదావరి జిల్లాలో మంచు దుప్పటి ద్వారక తిరుమల క్షేత్రంలో రమణీయ దృశ్యాలు.

Update: 2022-02-05 07:24 GMT

West Godavari:పశ్చిమగోదావరి జిల్లాలో మంచు దుప్పటి

West Godavari: పశ్చిమగోదావరి జిల్లా ద్వారకాతిరుమల చిన్న తిరుమలేశుని క్షేత్రంపై మంచు దుప్పటి కప్పడంతో ప్రకృతి రమణీయ దృశ్యాలు కనిపించాయి. ఎన్నడూ లేని విధంగా ఇవాళ తెల్లవారు జాము నుండి ఇప్పటి వరకు ఏకధాటిగా పొగమంచు కురిసింది. దీంతో క్షేత్ర పరిసరాలన్నీ మంచు పరదా తో కప్పు కొన్నాయి. కనీసం ఆలయ పరిసరాలు కంటికి సైతం కనబడని విధంగా మారాయి. విపరీతంగా మంచు కురవడంతో శేషాచల కొండపై రహదారులు సరిగా కనిపించక భక్తులు ఇబ్బందులు పడ్డారు. తమ వాహనాలకు ఉన్న లైట్ల ఆధారంగా వారు నెమ్మదిగా క్షేత్రానికి చేరుకున్నారు. శివాలయం, శ్రీవారి ఆలయ రాజగోపురం ల సముదాయం, అన్నమయ్య ప్రాంతం,... ఇలా శేషాచల ప్రాంతమంతా మంచుతో ఈ సుందర దృశ్యాలు భక్తులను పరవశింపజేసాయి.

Tags:    

Similar News