శ్రీశైలం జలాశయంలోకి తగ్గిన వరద ప్రవాహం

ఎగువన వర్షాలు తగ్గడంతో కృష్ణా నదికి కూడా వరద ప్రవాహం క్రమేణా తగ్గుతోంది. దీంతో శ్రీశైలం ప్రాజెక్టులోకి వరదనీరు..

Update: 2020-09-09 04:54 GMT

ఎగువన వర్షాలు తగ్గడంతో కృష్ణా నదికి కూడా వరద ప్రవాహం క్రమేణా తగ్గుతోంది. దీంతో శ్రీశైలం ప్రాజెక్టులోకి వరదనీరు తగ్గుముఖం పట్టింది. మంగళవారం సాయంత్రం ఆరు గంటలకు 45,560 క్యూసెక్కులు మాత్రమే చేరుతున్నాయి. గతవారం వరకూ ప్రాజెక్టులోకి దాదాపు లక్ష క్యూసెక్కులు దాకా వరదనీరు వచ్చి చేరింది. ఇక ప్రస్తుతం శ్రీశైలం రిజర్వాయర్ 884.8 అడుగుల్లో 214.85 టీఎంసీల నీరు నిల్వ ఉంది. మరోవైపు నాగార్జునసాగర్‌లోకి 17,692 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తోంది.. దీంతో సాగర్ ఎడమ కాలువ ద్వారా, ఏఎమ్మార్పీ, హైదరాబాద్ మహానగరం‌ తాగునీటి అవసరాల కోసం ఇంతే సంఖ్యలో విడుదల చేస్తున్నారు. సాగర్ పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్ధ్యం 315

టిఎంసీలు కాగా ప్రస్తుతం 587.7 అడుగుల్లో 305.92 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. మరోవైపు సాగర్ కు దిగువన ఉన్న పులిచింతల ప్రాజెక్టులోకి 2,500 క్యూసెక్కులు చేరుతున్నాయి. మరోవైపు ప్రకాశం బ్యారేజీలోకి 21,305 క్యూసెక్కులు చేరుతున్నాయి.. దీంతో కృష్ణా డెల్టా ఆయకట్టుకు కాలువల ద్వారా 15,502 క్యూసెక్కులను నీటిని విడుదల చేస్తున్నారు. ఇదిలావుంటే గోదావరి నదికి కూడా వరద ప్రవాహం తగ్గడంతో ధవళేశ్వరం బ్యారేజీలోకి 2,38,735 క్యూసెక్కులు చేరుతున్నాయి.. 2,25,435 క్యూసెక్కులను సముద్రంలోకి వృధాగా పోతున్నాయి. 

Tags:    

Similar News