Asani Cyclone: గంటకు 12 కి.మీ. వేగంతో పయనిస్తున్న అసాని తీవ్ర తుఫాన్
Asani Cyclone: *తుఫాన్ ప్రభావంతో అప్రమత్తమైన ఈస్ట్ కోస్ట్ రైల్వే *అసాని తుఫాన్ కారణంగా విమాన సర్వీసులు రద్దు
Asani Cyclone: తీవ్ర తుపానుగా కొనసాగుతున్న అసని.. ఇవాళ తుపానుగా బలహీనపడే అవకాశముందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. ఇవాళ వాయవ్య దిశగా కదులుతూ ఉత్తర కోస్తాంధ్రకు దగ్గరగా వచ్చే అవకాశముందని వెల్లడించింది. తర్వాత దిశ మార్చుకొని ఉత్తర ఈశాన్యంగా ఒడిశా తీరం వెంట పయనించవచ్చని అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో తీవ్రత తగ్గి తుపానుగా బలహీనపడొచ్చనని తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. అనంతరం మరింత బలహీనమై తీవ్ర వాయుగుండంగా వాయవ్య బంగళాఖాతంలోకి పయనించే అవకాశముందని అంచనా. తుపాను కారణంగా ఇవాళ, రేపు తూర్పుగోదావరి, కోనసీమ, అనకాపల్లి, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ఒక మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలతోపాటు ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. గంటకు 40 కిలోమీటర్ల నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశముందని హెచ్చరించింది
బంగాళాఖాతంలో ఆసాని తుపాను కారణంగా తీవ్ర గాలులు వీడయంతో కోస్తా తీరం అల్లకల్లోలంగా మారింది. గంటకు 12 కిలోమీటర్ల వేగంతో అసాని తీవ్ర తుఫాన్ పయనిస్తుంది. కాకినాడకు 330 కిలోమీటర్లు, విశాఖకు 350 కిలోమీటర్లు, పూరికి 590 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. ఉత్తరాంధ్రలో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడుతున్నాయి. ఈదురుగాలులకు పలు ప్రాంతాల్లో కరెంట్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. అసాని తుఫాన్ నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. విశాఖ కలెక్టరేట్‌లో టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేశారు. విశాఖ జిల్లాలో 11 మండలాలకు అధికారులను నియమించారు. మరోవైపు నేవీ కోస్ట్ గార్డ్ రంగంలోకి దిగింది. తుఫాన్ ప్రభావంతో అప్రమత్తమైన ఈస్ట్ కోస్ట్ రైల్వే కూడా అప్రమత్తమైంది. అసాని తుఫాన్ కారణంగా విమానా సర్వీసులు రద్దయ్యాయి. విశాఖ, శ్రీకాకుళం, మన్యం, విజయనగరం, తూర్పుగోదావరి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు.