శ్రీకాకుళం జిల్లా పెద్దబొడ్డపాడులో అగ్నికి ఆహుతైన పొలాలు.. 20 ఎకరాల మేర వరిచేనులు బూడిద

Srikakulam: ఒక పొలం నుండి మరో పొలానికి క్షణాల్లో వ్యాపించిన మంటలు

Update: 2023-12-01 09:47 GMT

శ్రీకాకుళం జిల్లా పెద్దబొడ్డపాడులో అగ్నికి ఆహుతైన పొలాలు.. 20 ఎకరాల మేర వరిచేనులు బూడిద

Srikakulam: శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు మండలం పెద్దబొడ్డపాడు గ్రామంలో వరిపొలాలు అగ్నికి ఆహుతయ్యాయి. దాదాపు 20 ఎకరాల మేర వరిచేనులు బూడిదయ్యాయి. ఒక పొలం నుండి మరో పొలానికి క్షణాల్లో మంటలు వ్యాపించాయి. పండిన వరి చేనుతో పాటు, పొలాల్లో ఆరబెట్టిన వరి కుప్పలు, రెండు మోటారు ఇంజన్లు దగ్ధం అయ్యాయి. పంట చేతికి వచ్చే సమయానికి ప్రమాదంలో పంట నష్టపోవడంతో.. రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రమాదంలో దాదాపు 15 లక్షల ఆస్తి నష్టం జరిగి ఉండవచ్చని అంచనా వేశారు. ఉపాధి హామీ పనుల్లో చెరువులో తొలగించిన ముళ్లపొదలకు నిప్పు పెట్టటంతో మంటలు వ్యాపించినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News