విజయవాడలో నకిలీ సర్టిఫికెట్ల బాగోతం బట్టబయలు

* బ్రోకర్ల ద్వారా కొన్ని సెంటర్లలో ఫేక్‌ సర్టిఫికెట్స్‌ ఇప్పిస్తున్న.. అన్నామలై యూనివర్సిటీ ప్రతినిధులు

Update: 2022-12-12 06:17 GMT

విజయవాడలో నకిలీ సర్టిఫికెట్ల బాగోతం బట్టబయలు

Vijayawada: విజయవాడలో నకిలీ సర్టిఫికెట్ల బాగోతం బట్టబయలైంది. ఎస్‌ఆర్‌పేట పోలీస్ స్టేషన్‌ పరిధిలో పదో తరగతి నకిలీ సర్టిఫికెట్ల బాగోతం వెలుగుచూసింది. అనంతపురానికి చెందిన కొందరు యువకులు ఒక్కో సర్టిఫికెట్‌ను లక్షన్నర పెట్టి కొన్నారు. ఆ సర్టిఫికెట్లతో పోస్టల్‌ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగాలకు అప్లయ్‌ చేశారు. అయితే వెరిఫికేషన్‌లో ఫేక్‌ సర్టిఫికెట్స్‌గా తేలడంతో యువకులు షాక్‌కు గురయ్యారు.

ఈ అంశంపై పోస్టల్‌ డిపార్ట్‌మెంట్‌ వివరణ ఇవ్వాలని చెప్పడంతో ఫేక్ సర్టిఫికెట్స్‌ అమ్మిన బ్రోకర్‌ను నిలదీశారు యువకులు. విజయవాడ బందర్‌ రోడ్డులో ఉన్న అన్నామలై బ్రాంచ్‌కు బ్రోకర్‌తో వెళ్లి గొడవకు దిగారు. ఆ సర్టిఫికెట్లు ఒరిజినలేనంటూ అన్నామలై యాజమాన్యం బుకాయించింది. దీంతో పోస్టల్‌ డిపార్ట్‌మెంట్‌ ఇచ్చిన నోటీసులను కాలేజీ యాజమాన్యానికి చూపించారు. అవన్నీ తమకు తెలియదంటూ తప్పించుకున్నారు. డబ్బులు వెనక్కి ఇవ్వాలంటూ యూనివర్సిటీ ప్రతినిధులతో యువకులు గొడవకు దిగారు. సూర్యారావుపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Tags:    

Similar News