మాజీ మంత్రి నారాయణ బెయిల్ రద్దు చేయాలని పిటిషన్
*పోలీసుల తరపున అదనపు అడ్వకేట్ జనరల్ సుధాకర్‌రెడ్డి పిటిషన్
Narayana Bail: ఏపీలో టెన్త్ క్లాస్ మాల్ ప్రాక్టీస్ కేసులో A-9 గా ఉన్న మాజీ మంత్రి నారాయణ బెయిల్ రద్దు చేయాలని కోరుతూ చిత్తూరు జిల్లా కోర్టులో పిటిషన్ దాఖలైంది. పోలీసుల తరపున అదనపు అడ్వకేట్ జనరల్ సుధాకర్‌రెడ్డి పిటిషన్ వేశారు. మాల్ ప్రాక్టీస్ వ్యవహారంలో నారాయణ పాత్రపై పోలీసుల వద్ద ఉన్న ఆధారాలను కోర్టుకు నివేదించారు.
పదో తరగతి ప్రశ్నపత్రం లీకేజీ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి నారాయణను చిత్తూరు పోలీసులు హైదరాబాద్‌లోని కొండాపూర్‌లో ఆయన నివాసంలో అదుపులోకి తీసుకున్నారు. మే 11న చిత్తూరులోని స్థానిక కోర్టు నారాయణకు బెయిల్ మంజూరు చేసింది. తాజాగా నారాయణ బెయిల్ రద్దు కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు.