Tirumala: తిరుమలలో ఉగ్రవాదులున్నట్లు మెయిల్ కలకలం
Tirumala: పోలీసులకు మెయిల్ పంపిన గుర్తుతెలియని వ్యక్తులు
Tirumala: తిరుమలలో ఉగ్రవాదులు ఉన్నట్లు పోలీసులకు ఓమెయిల్ కలకలం రేపింది. ఉగ్రవాదులతో విపత్కరపరిస్థితులు తలెత్తే అవకాశం ఉందని అప్రమత్తమైన పోలీసులు, విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఉద్దేశపూర్వకంగా ఫేక్ మెయిల్‌తో ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారని ఎస్పీ పరమేశ్వరరెడ్డి తెలిపారు. తిరుమలలో భద్రత పటిష్టంగా ఉందన్నారు. తిరుపతిలోనే క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించి తిరుమలకు అనుమతిస్తుండటంతో ఉగ్రవాదులు తిరుమలకు వెళ్లే అవకాశమే లేదన్నారు ఎస్సీ పరమేశ్వర్ రెడ్డి. తిరుమలతో ఎలాంటి ఉగ్రవాద కదలికల్లేవని స్పష్టంచేశారు.