Election Commission: ఏపీలో సంక్షేమ పథకాల నగదు బదిలీ పోలింగ్‌ తర్వాతే...

Election Commission: ఈ నెల 13వ తేదీన ఏపీ రాష్ట్ర శాసనసభకు ఎన్నికల పోలింగ్ జరుగనుంది.

Update: 2024-05-09 09:44 GMT

Election Commission: ఏపీలో సంక్షేమ పథకాల నగదు బదిలీ పోలింగ్‌ తర్వాతే...

Election Commission: ఈ నెల 13వ తేదీన ఏపీ రాష్ట్ర శాసనసభకు ఎన్నికల పోలింగ్ జరుగనుంది. అదే రోజున 25 లోక్‌సభ స్థానాలకు కూడా పోలింగ్ నిర్వహిస్తారు. అయితే ఏపీలో సంక్షేమ ప‌థ‌కాల న‌గ‌దు బ‌దిలీపై ఎన్నిక‌ల సంఘం ఆంక్ష‌లు విధించింది. పోలింగ్ త‌ర్వాతే న‌గ‌దు జ‌మ చేయాల‌ని ఆదేశించింది. ఇప్ప‌టికే బ‌ట‌న్ నొక్కిన ప‌థ‌కాల డ‌బ్బు జ‌మ‌ను ఎన్నిక‌ల‌య్యే వ‌ర‌కు వాయిదా వేసింది. మే 13వ తేదీన పోలింగ్ ముగిసిన త‌ర్వాత డ‌బ్బు జ‌మ చేసేలా మార్గ‌ద‌ర్శ‌కాలు జారీ చేస్తామ‌ని ఈసీ పేర్కొంది. కాగా, ఎల‌క్ష‌న్ కోడ్ కంటే ముందే వివిధ ప‌థ‌కాల కోసం జ‌గ‌న్ బ‌ట‌న్ నొక్కారు. అయితే, ఎన్నిక‌లు ముగిసిన త‌ర్వాతే ల‌బ్ధిదారుల‌కు న‌గ‌దు జ‌మ చేయాల‌ని ఈసీ ఆదేశించింది.

Tags:    

Similar News