Vijayawada: విజయవాడ ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా మహోత్సవాలు
*ఇవాళ రాజరాజేశ్వరి దేవిగా అమ్మవారి దర్శనం *శ్రీచక్ర అధిష్టానదేవత శ్రీరాజరాజేశ్వరి దేవిగా దర్శనం
Vijayawada: విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. పది రోజల పాటు అమ్మవారు అనేక రూపాల్లో దర్శనం ఇచ్చారు. పదో రోజు విజయదశిమి రోజు దుర్గాదేవి శ్రీ రాజరాజేశ్వరి దేవిగా దర్శనం ఇస్తున్నారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు తరలివచ్చారు. విజయదశిమి రోజు అమ్మవారిని దర్శించుకుంటే విజయాలు చేకూరుతాయని భక్తులు నమ్ముతారు. చిరునవ్వుతో చెరుకుగడను వామ హస్తముతో ధరించి దక్షిణ హస్తముతో అభయాన్ని ప్రసాదించే రూపంలో షోడ శాక్షరీ మహామంత్ర స్వరూపిణీ మహాత్రిపుర సుందరిగా అమ్మవారు దర్శనం ఇస్తున్నారు. ఇవాళ సాయంత్రం తెప్పోత్సవంతో దసరా ఉత్సవాలు ముగుస్తాయి. కృష్ణా నదిలో గంగా పార్వతి సమేత దుర్గా మల్లేశ్వరులు త్రిలోక సంచారం చేసేందుకు జలవిహారం ఉంటుంది. అయితే నదిలో వరద ప్రవాహం ఎక్కువగా ఉండడంతో విహారం రద్దు చేశారు. తీరంలోనే ఉత్సవాన్ని నిర్విహించేందుకు అధికారులు నిర్ణయించారు.