AP TET Hall Tickets 2024 : ఏపీ టెట్ హాల్ టికెట్స్ విడుదల..డౌన్ లోడ్ చేసుకోండిలా

AP TET Hall Tickets 2024 : ఏపీ టెట్ 2024 హాల్ టికెట్స్ అందుబాటులోకి వచ్చాయి. టెట్ అధికారిక వెబ్ సైట్ నుంచి వీటిని మీరు డౌన్ లోడ్ చేసుకోవచ్చు. అక్టోబర్ 3వ తేదీ నుంచి టెట్ పరీక్షలు షురూ కానున్నాయి. నవంబర్ 2వ తేదీన ఫలితాలను ప్రకటిస్తారు.

Update: 2024-09-22 03:19 GMT

AP TET Hall Tickets 2024 : ఏపీ టెట్ హాల్ టికెట్స్ విడుదల..డౌన్ లోడ్ చేసుకోండిలా

AP TET Hall Tickets 2024 : ఏపీ ఉపాధ్యాయ అర్హత పరీక్ష హాల్ టికెట్లు రిలీజ్ అయ్యాయి. అభ్యర్థులు టెట్ వెబ్ సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. శనివారం రాత్రి వీటిని విడుదల చేశారు. ఇందుకు సంబధించిన వ్రాత పరీక్షలు అక్టోబర్ 3వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. అక్టోబర్ 20వ తేదీ వరకు ఈ పరీక్షలు జరుగుతాయి.

ఈ పరీక్షలను కంప్యూటర్ బేస్డ్ టెస్టు విధానంలో నిర్వహించనున్నారు. టెట్ అధికారిక వెబ్ సైట్ నుంచి హాల్ టికెట్స్ ను డౌన్ లోడ్ చేసుకోవాలని అధికారులు సూచించారు. టెట్ పరీక్షలు రెండు సెషన్లలో 18 రోజులు పాటు జరుగుతాయి. మొదటి సెషన్ ఉదయం 9.30గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు జరుగుతుంది. ఇక రెండో సెషన్ మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు జరుగుతుంది.

హాల్ టికెట్లు డౌన్ చేసుకోండిలా

- ఏపీ టెట్ అభ్యర్థులు https://aptet.apcfss.in/# వెబ్ సైట్లోకి వెళ్లాక అక్కడ హోం పేజీలో కనిపించే AP TET Hall Tickets(July) 2024 అనే ఆప్షన్ పై క్లిక్ చేయాండి.

-ఇక్కడ అభ్యర్థి Candidate ID, పుట్టిన తేదీతోపాటు వెరిఫికేషన్ కోడ్ ను ఎంటర్ చేయాలి.

-లాగిన్ పై క్లిక్ చేస్తే టెట్ హాల్ టికెట్ డిస్ల్పే అవుతుంది.

-ప్రింట్ లేదా డౌన్ లోడ్ ఆప్షన్ పై నొక్కి కాపీని తీసుకోవాలి.

-పరీక్ష కేంద్రంలోకి వెళ్లాలంటే హాల్ టికెట్ తప్పని సరిగా ఉండాలి.

-ప్రింట్ ఔట్ తీసుకుని భవిష్యత్ అవసరా కోసం కూడా భద్రంగా ఉంచుకోవాలి. 

Tags:    

Similar News