Gazette Notification: గెజెట్ నోటిఫికేషన్ అమలుపై సందేహాలు
*వాస్తవానికి రేపటినుంచి అమల్లోకి రావాల్సిన గెజెట్ *ఇప్పటి వరకూ సానుకూలంగా స్పందించని రెండు రాష్ట్రాలు
Gazette Notification: తెలుగు రాష్ట్రాల మధ్య జలజగడాలకు పరిష్కారంగా గెజెట్ ఏర్పాటు చేసినా సమస్య మాత్రం తీరడం లేదు. రెండు రాష్ట్రాలు దీనిపై ఇంకా సానుకూల స్పందన చేయకపోగా, ఎవరికి ఇష్టం వచ్చిన రీతిలో వారు వ్యవహరిస్తున్నారు. కృష్ణా, గోదావరి నదులపైఉన్న ప్రాజెక్టులన్నింటినీ బోర్డుల పరిధిలోకి తెస్తూ గెజెట్ నోటిఫికేషన్ జారీ అయినా ఇరు రాష్ట్రాలు ససేమిరా అంటున్నాయి. విద్యుత్ ప్రాజెక్టులను బోర్డు పరిధిలోకి తెస్తే అంగీకరించబోమని తెలంగాణ పట్టుబడుతుంటే, తమకు అన్యాయం జరుగుతున్నదే విద్యుత్ ప్రాజెక్టుల వల్ల కాబట్టి వాటిని బోర్డు పరిధిలోకి తేవాల్సిందేనంటోంది ఏపీ.
పైగా బోర్డులు పనిచేయడానికి 200 కోట్ల క్యాష్ డిపాజిట్ చెల్లించే అంశంపై కూడా ఏపీ, తెలంగాణ ఒక్క మాట మాట్లాడటం లేదు. దాంతో రేపటినుంచి అమల్లోకి రావాల్సిన గెజెట్ నోటిఫికేషన్ సందిగ్ధంగా మారింది.