AP News: ఏపీలో రేపటి నుంచి పెన్షన్ల పంపిణీ.. రెండు కేటగిరీల్లో
AP News: రేపటి నుంచి ఈ నెల 6వరకు పెన్షన్ల పంపిణీ
AP News: ఏపీలో పెన్షన్లపై ఆందోళనలు, అనుమానాలు నెలకొన్న వేళ..రాష్ట్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చేసింది. రేపటి నుంచి ఈ నెల 6వరకు పెన్షన్ల పంపిణీ జరగనుంది. ఈ మేరకు పెన్షన్ల పంపిణీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం విధి విధానాలు జారీ చేసింది. సిబ్బంది కొరత ఉన్న నేపథ్యంలో.. రెండు కేటగిరీలుగా పెన్షన్ల పంపిణీ చేయాలని సర్కార్ నిర్ణయించింది. దివ్యాంగులు, వృద్ధులు, రోగులకు ఇంటి దగ్గరికే వెళ్లి పెన్షన్ ఇవ్వనున్నారు. మిగతావారికి గ్రామ, వార్డు సచివాలయాల్లో పంపిణీ చేయనున్నట్లు సర్కార్ స్పష్టం చేసింది. పెన్షన్ల పంపిణీ సమయంలో సచివాలయాలు ఉదయం 9 నుంచి రాత్రి 7 గంటల వరకు పని చేయాలని ఉత్తర్వుల్లో వెల్లడిచింది..