AP Pension: నేటి నుంచి ఏపీ వ్యాప్తంగా పెంచిన పెన్షన్ పంపిణీ

AP Pension: నేటి నుంచి వారం పాటు పెన్షన్ వారోత్సవాలు

Update: 2023-01-01 03:19 GMT

AP Pension: నేటి నుంచి ఏపీ వ్యాప్తంగా పెంచిన పెన్షన్ పంపిణీ

AP Pension:  ఏపీలో పెన్షన్ల పంపిణీ సాగుతోంది. పెంచిన పెన్షన్ మొత్తం 2వేల 750 రూపాయలు అందజేస్తున్నారు. ఇప్పటి వరకు ప్రతి నెలా 2వేల 500 రూపాయల చొప్పున అందుకుంటున్నారు. ఈ నెల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 2లక్షల 31వేల 989 మందికి ప్రభుత్వం కొత్తగా పింఛన్లు మంజూరు చేసింది. జనవరి 1 నుంచి జరిగే పంపిణీ కార్యక్రమాన్ని పండుగ వాతావరణంలో వారోత్సవంగా నిర్వహించాలని నిర్ణయించింది.

నేటి నుంచి 7వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా మండల, మున్సిపాలిటీల స్థాయిలో ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనుంది. జనవరి 3వ తేదీన సీఎం వైఎస్‌ జగన్‌ రాజమండ్రిలో పింఛను పెంపు వారోత్సవ కార్యక్రమంలో పాల్గొననున్నారు.

ప్రభుత్వం తాజాగా మంజూరు చేసిన 2లక్షల 31వేల 989 పింఛన్లతో కలిపి జనవరి నెలలో రాష్ట్రంలో సామాజిక పింఛన్ల లబ్ధిదారుల సంఖ్య 64లక్షల 06వేల 240కి చేరుకుంది.ఆదివారం తెల్లవారుజాము నుంచే వలంటీర్లు లబ్ధిదారుల ఇళ్లకే వెళ్లి పెరిగిన పింఛను డబ్బులు చెల్లిస్తున్నారు. ఇందుకోసం ప్రభుత్వం శనివారమే అన్ని గ్రామ, వార్డు సచివాలయ శాఖల బ్యాంకు ఖాతాల్లో 1వేయి 765 కోట్ల నిధులను జమ చేసింది. 


Full View


Tags:    

Similar News