అచ్యుతాపురం సెజ్‌ ఘటనలో పెరుగుతున్న మృతుల సంఖ్య

రియాక్టర్ పేలిన ఘటనలో ఇప్పటివరకు ఐదుగురు మృతి

Update: 2024-08-21 13:01 GMT

Atchuthapuram Sez: అచ్యుతాపురం సెజ్ ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు రూ.కోటి పరిహారం 

 అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్‌‌లో భారీ ప్రమాదం జరిగింది. సెజ్‌లోని ఎసెన్సియా ఫార్మా కంపెనీలో రియాక్టర్‌ పేలింది. ఈ ఘటనలో ఇప్పటివరకు ఐదుగురు కార్మికులు మృతి చెందారు. మరో 14 మంది కార్మికులు తీవ్ర గాయాలపాలయ్యారు. బాధితులను చికిత్స నిమిత్తం అనకాపల్లిలోని వివిధ ఆస్పత్రులకు తరలించారు.

ఎసెన్సియా ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలడంతో పరిశ్రమ భవనం దెబ్బతింది. ఘటనా సమయంలో 300 మంది కార్మికులు పరిశ్రమలో ఉన్నట్టు సమాచారం. ప్రమాదంలో గాయపడిన వారిని హుటాహుటిన హాస్పిటల్‌కు తరలించారు. ఇప్పటివరకు ఐదుగురు మరణించగా.. మరికొంత మంది కార్మికులు పరి‌శ్రమలో చిక్కుకుని ఉంటారని భావిస్తున్నారు. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలున్నాయి. అయితే పేలుడుతో భారీ ఎత్తున మంటలు చెలరేగడంతో...12 ఫైర్ ఇంజిన్లతో వాటిని ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు కంపెనీ పరిసరాల్లో దట్టమైన పొగ అలుముకుంది. పేలుడు ధాటికి మొదటి అంతస్తు పైకప్పు కుప్పకూలింది.

ఇక ఈ ప్రమాదంపై సీఎం చంద్రబాబు స్పందించారు. జిల్లా కలెక్టర్‌తో మాట్లాడిన సీఎం.. బాధితులకు అందుతున్న వైద్యంపై ఆరా తీశారు. మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. తక్షణం సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

Tags:    

Similar News