Indrakeeladri: ఇంద్రకీలాద్రిపై దసరా మహోత్సవాలకు ఏర్పాట్లు

Indrakeeladri: అక్టోబర్‌ 7 నుంచి 15 వరకు శరన్నవరాత్రి వేడుకలు *దసరా ఉత్సవాల నేపథ్యంలో కో-ఆర్డినేషన్‌ కమిటీ కీలక నిర్ణయం

Update: 2021-09-23 08:15 GMT

ఇంద్రకీలాద్రిపై దసరా మహోత్సవాలకు ఏర్పాట్లు (ఫైల్ ఇమేజ్)

Indrakeeladri: ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి మహోత్సవాల నేపథ్యంలో కో-ఆర్డినేషన్‌ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. కోవిడ్‌ దృష్ట్యా ఈ ఏడాది 30వేల మంది భక్తులకు మాత్రమే అనుమతిస్తోంది. మూలా నక్షత్రం రోజున అమ్మవారి దర్శనానికి 70వేల మంది భక్తులకు పర్మిషన్‌ ఇచ్చింది. అలాగే అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఆన్‌లైన్‌ స్లాట్‌ తప్పనిసరి చేసింది. ఇందుకోసం కొండపై ఆన్‌లైన్‌ కౌంటర్ల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తోంది. అన్ని శాఖలు అలర్ట్‌గా ఉండాలని సర్క్యులర్‌ జారీ చేసిన కో-ఆర్డినేషన్‌ కమిటీ భవానీ మాలధారణ విషయంపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసింది. ఇంద్రికీలాద్రిపై అక్టోబర్‌ 7 నుంచి 15 వరకు దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరగనున్నాయి. 7న శ్రీస్వర్ణ కవచాలంకృత దుర్గాదేవిగా అమ్మవారు భక్తులకు దర్శనమివ్వనున్నారు. 

Full View


Tags:    

Similar News