Letter to President of india: న‌క్స‌లైట్ల‌లో చేరేందుకు అనుమ‌తివ్వండి: రాష్ట్ర‌ప‌తికి లేఖ‌

Letter to President of india: న‌క్స‌లైట్స్‌లో చేరేందుకు అనుమతివ్వాలంటూ ఓ ద‌ళిత యువ‌కుడు రాష్ట్ర‌ప‌తి రామ్‌నాథ్ కోవింద్‌కు లేఖ రాయడం చ‌ర్చ‌నీయంగా మారింది.

Update: 2020-08-10 18:58 GMT

Letter to President of india: న‌క్స‌లైట్స్‌లో చేరేందుకు అనుమతివ్వాలంటూ ఓ ద‌ళిత యువ‌కుడు రాష్ట్ర‌ప‌తి రామ్‌నాథ్ కోవింద్‌కు లేఖ రాయడం చ‌ర్చ‌నీయంగా మారింది. వివ‌రాల్లోకెళ్తే.. కొద్ది రోజుల క్రితం వైసీపీ నేత ఇసుక మాఫియాను అడ్డుకున్నందుకు తూర్పు గోదావరి జిల్లా సీతానగరంలో పోలీస్ స్టేషన్ ప‌రిధిలోని వరప్రసాద్ అనే ద‌ళిత యువ‌కుడిని శిరోముండనం చేయించి, అవ‌మానించారు. తనకు శిరోముండనం చేయించిన అసలు నిందితులను పోలీసులు ఇంతవరకు అరెస్ట్ చేయలేదని ఆరోపించారు. ఏపి ప్రభుత్వం, పోలీసుల వల్ల తనకు న్యాయం లభించలేదని.. తమరే కలుగజేసుకుని న్యాయం జరిగేలా చూడాలని కోరాడు. లేదంటే నక్సలైట్స్ లో చేరేందుకు అనుమతివ్వాలంటూ వేడుకున్నాడు. ఈ లేఖ పై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సోషల్ మీడియా వేదిక‌గా స్పందించారు.

''పాలకుల దుర్మార్గం, అణచివేత, అహంకారం, వివక్షత... ఇవన్నీ పెచ్చుమీరితే యువత ఎలా పక్కదారి పడుతుందో చెప్పడానికి ఈ ప్రసాద్ అనే దళిత యువకుడు ఉదాహరణ. కొద్ది రోజుల క్రితం వైసీపీ నేత ఇసుక మాఫియాను అడ్డుకున్నందుకు సీతానగరం పోలీస్ స్టేషన్లో ఇతనికి శిరోముండనం చేసి అవమానించారు. ఇంతవరకు ప్రసాద్ కు న్యాయం జరగలేదు. ఫలితంగా తాను నక్సలైట్ గా మారేందుకు అనుమతి ఇవ్వమని రాష్ట్రపతికి లేఖ రాసే పరిస్థితి వచ్చింది. ఇది తెలిసి బాధేసింది. ఎంతో భవిష్యత్తు ఉన్న యువకుడిలో ఇటువంటి ఆలోచన వచ్చిందంటే... రాష్ట్రంలో వ్యవస్థలు ఎంత ప్రమాదకరంగా దిగజారాయో ప్రజలు ఆలోచించాలి''  అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు.  

Tags:    

Similar News