Cyclone Mandous: ఏపీలో తగ్గని తుఫాన్‌ ప్రభావం..

Cyclone Mandous: ఒంగోల్లో దెబ్బతిన్న పంట పొలాలు

Update: 2022-12-11 14:21 GMT

Cyclone Mandous: ఏపీలో తగ్గని తుఫాన్‌ ప్రభావం.. 

Cyclone Mandous: మాండూస్‌ ప్రభావం ఇంకా ఏపీలో కొనసాగుతూనే ఉంది. తుఫాన్‌ తీవ్రత తగ్గినప్పటికీ ముడు రోజులుగా సీమను వర్షాలు వీడడం లేదు. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమైయ్యాయి. ఇళ్లలోకి వరద నీరు భారీగా చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భారీ వర్షాల కారణంగా పంట పొలాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. మిర్చి, మినుములు, కంది పంటల్లో వరద నీరు చేరగా... పొగాకు, శనగ పైర్లను వర్షాలు ముంచేశాయి. తుఫాన్ ప్రభావం ఒంగోలు, ప్రకాశం జిల్లాలో అధికంగా ఉంది. ఒంగోల్లో అత్యధికంగా 148 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. కొండల నుంచి ఇన్‌ఫ్లో పెరగడంతో చిత్తూరు జిల్లా రిజర్వాయర్లు నిండు కుండను తలపిస్తున్నాయి. దీంతో ముంపు ప్రాంతాల ప్రజలను అధికారులు పునరావాస కేంద్రాలకు తరలించారు. మరోవైపు మరో మూడు రోజు పాటు తెలంగాణలో వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.

Tags:    

Similar News