Kakinada Collector: కాకినాడ కలెక్టర్ కృతికా శుక్లా పేరుతో సైబర్ కేటుగాళ్ల మెసేజ్‌లు
Kakinada Collector: కలెక్టర్ కృతికా శుక్లా ఫోటో వాట్సాప్ డీపీతో మెసేజ్
Kakinada Collector: సైబర్ నేరగాళ్లు ఎవరిని వదలడంలేదు. ఏకంగా కలెక్టర్ పేరుతో ఫేక్ మేసేజ్‌లు పంపి డబ్బులు కాజేసేందుకు యత్నించారు. కాకినాడ జిల్లా కలెక్టర్ పేరుతో అధికారుల్ని మోసం చేసేందుకు ప్రయత్నించిన ఘటన కలకలం రేపింది. కాకినాడ జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా ఫోటో డీపీగా ఉన్న వాట్సాప్ నంబరుతో జిల్లాస్థాయి అధికారులకు ఓ వాట్సాప్ మెసేజ్ వెళ్లింది. తాను మీటింగ్‌లో ఉన్నానని.. మాట్లాడే పరిస్థితిలో లేను అన్నారు. అర్జంట్‌గా తనకు డబ్బు కావాలి.. అమెజాన్ పేలో డబ్బులు పంపించండి అంటూ కోరారు. కలెక్టర్ డబ్బులు అడగడం ఏంటి.. మెసేజ్ పెట్టడం ఏంటని వారికి అనుమానం వచ్చింది. ఈ మెసేజ్ గురించి ఓ అధికారి కలెక్టర్‌నే నేరుగా అడిగారు. అయతే తాను డబ్బులు అడగడం ఏంటని.. వెంటనే జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్‌బాబుకు ఫిర్యాదు చేశారు. తన పేరుతో వాట్సాప్ కాల్, సందేశాలు ఎవరు పంపినా, డబ్బులు అడిగినా స్పందించవద్దని కోరారు. ఈ తరహా మెసేజ్‌ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని అన్ని శాఖల అధికారులకు సూచించారు.