Andhra Pradesh: ఆర్థిక కష్టాల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు అదనపు భారం

Andhra Pradesh: పీకల్లోతు ఆర్థిక కష్టాల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు అదనపు భారం * ఖ‌జానాపై వ్యాక్సిన్ కొనుగోళ్ల ఎఫెక్ట్

Update: 2021-04-24 02:30 GMT
సీఎం జగన్ (ఫైల్ ఇమేజ్)

Andhra Pradesh:కరోనా కష్టకాలంలో అంతంత సొమ్ములను ప్రభుత్వం ఎక్కడి నుంచి తెస్తోంది. కొత్త పథకాలను ఎలా అమలు చేస్తున్నారు. ఇప్పటికే అమలు చేసిన భారీ బడ్జెట్ పథకాలు ఏ ఆటంకం లేకుండా ఎలా సాగుతున్నాయి ? అన్ని రాష్ట్రాలు ఆర్థికమాంద్యంతో గోల గోల చేస్తుంటే, ఏపీలో జగన్ ఏ విధంగా ఏ ఇబ్బంది లేకుండా పాలన సాగిస్తున్నాడు? ఇలా అనేక విషయాలు చాలా కాలంగా ఎవరికీ అంతుబట్టడం లేదు. ఇలాంటి టైమ్‌లో జగన్‌ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. అసలే ఆర్థిక కష్టాలతో ఏపీ సతమతం అవుతోంది. కరోనా దెబ్బకు ఏపీ అర్థిక వ్యవస్థ కుదేలైంది. అయినా సీఎం జగన్‌ ఎక్కడ కాప్రమైజ్ కావడం లేదు.

అటు పథకాల విషయంలో ఇటు కరోనా కట్టడి విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పటికే ఖజానా ఖాళీ అయి ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న రాష్ట్రానికి ఇప్పుడు క‌రోనా సెకండ్ వేవ్, పిడుగులా వ‌చ్చి ప‌డింది. ఇలాంటి టైమ్‌లో ఏపీ సీఎం జగన్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో 18 ఏళ్లు దాటిన అందరికీ ఉచితంగా కరోనా వ్యాక్సిన్‌ ఇస్తామని సీఎం జగన్‌ ప్రకటించారు. 18 - 45 మధ్య ఉన్నవారికి ఉచితంగా కొవిడ్‌ వ్యాక్సిన్‌ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో 2 కోట్ల 4 లక్షల మందికి పైగా కొవిడి ఉచిత టీకా ఇవ్వనున్నట్టు స్పష్టం చేశారు. దీంతో టీకా రూపంలో ప్రభుత్వంపై మరింత భారం పడబోతోంది.

కరోనా కట్టడిలో భాగంగా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. 18 ఏళ్ల పైబడిన వారందరికీ టీకా ఇవ్వాలని నిర్ణయించింది. అయితే ఇప్పుటి వ‌ర‌కు కొవిడ్ టీకా కేంద్రమే రాష్ట్రాల‌కు వ్యాక్సిన్ స‌ర‌ఫ‌రా చేసింది. మే 1 నుండి టీకా రాష్ట్రాల‌దే బాధ్యత అంటూ చేతులేత్తేసింది. 18 ఏళ్ల నుంచి 45 ఏళ్ల మధ్య వయస్సున్న వారికి టీకాలను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే కొనుగోలు చేసుకోవాలని నిర్ణయించింది. అయితే ఇప్పటి వ‌ర‌కు టీకాను కేంద్రమే రాష్ట్రాల‌కు ఉచితంగా ఇవ్వడంతో రాష్ట్ర్రాల‌పై పెద్దగా భారం పడలేదు. ఇకపై టీకా ఖ‌ర్చు రాష్ట్ర ప్రభుత్వాల‌దైతే ఎంత ఖ‌ర్చు అవుతోంద‌న్న చ‌ర్చ అన్ని రాష్ట్రాల ఆర్ధిక శాఖ అధికారుల‌ను క‌ల‌వ‌రపెడుతోంది. ఈ టైమ్‌లో రాష్ట్రంలో 18 ఏళ్లు దాటిన అందరికీ ఉచితంగా కరోనా వ్యాక్సిన్‌ ఇస్తామని సీఎం జగన్‌ నిర్ణయించారు.

రాష్ట్ర వ్యాప్తంగా సుమారు నాలుగు కోట్లకు పైగా జనాభా 18 ఏళ్లకు పైబడి ఉన్నారని ప్రభుత్వ గ‌ణాంకాలు చెప్తున్నాయి. ప్రస్తుతం వీరందరూ మే 1వ తేదీ నుంచి టీకా వేయించుకోవడానికి అర్హులు. ఒక్కోక్కరికి రెండు డోసులు వేయాల్సిందే. అంటే అందరికీ వ్యాక్సిన్ ఇవ్వాలంటే కనీసం 7కోట్ల డోసులు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. కేంద్రం ప్రక‌టించిన‌ట్లు ఒక్కడోస్ 400 రుపాయిల ప్రకారం సుమారు మూడు వేల కోట్ల వరకు రాష్ట్ర ప్రభుత్వం ఖ‌ర్చు చేయాల్సి ఉంది. అసలే రాష్ట్రం పీకల్లోతు ఆర్థిక కష్టాల్లో ఉంది. ప్రస్తుతమున్న పరిస్థితుల్లో ఖ‌జానాకు వ‌చ్చేది కూడా అంతంత మాత్రమే. ఇలాంటి పరిస్థితుల్లో ఒక‌వేళ రాష్ట్ర ప్రభుత్వమే ప్రజ‌ల‌కు ఉచితంగా టీకా వేయాలంటే వేల కోట్ల భారం మోయక తప్పదనే చ‌ర్చ జ‌రుగుతోంది. ఇప్పటికే న‌వ‌ర‌త్నాలకు ఏడాదికి 50 వేల కోట్లకు పైగా ఏపీలో ఖర్చవుతోంది. క‌రోనా విప‌త్తులో కేంద్రం ఉచిత స‌ల‌హాల‌కే ప‌రిమితం అయ్యింది. 

Tags:    

Similar News