మన్యం ప్రాంతానికి పాకిన కరోనా మహమ్మారి
చింతపల్లి గ్రామంలో కరోనా కలకలం రేగింది. సాయంత్రం గ్రామంలో పలువురికి కరోనా లక్షణాలు ఉన్నట్లు గుప్పుమనడంతో గ్రామంలో ప్రజలతోపాటు మన్యవాసులలో ఆందోళన మొదలైంది.
చింతపల్లి గ్రామంలో కరోనా కలకలం రేగింది. సాయంత్రం గ్రామంలో పలువురికి కరోనా లక్షణాలు ఉన్నట్లు గుప్పుమనడంతో గ్రామంలో ప్రజలతోపాటు మన్యవాసులలో ఆందోళన మొదలైంది. కరోనా కలకలంతో అప్రమత్తమైన అధికారులు లక్షణాలు కలిగిన వ్యక్తిని హుటాహుటిన కరోనా వైద్య పరీక్షల నిమిత్తం విశాఖపట్నం తరలించారు. శనివారం ఉదయమే కరోనా లక్షణాలు కలిగిన వ్యక్తి నివాసం ఉండే ప్రాంతాన్ని అధికారులు, ఆర్వీ నగర్ వైద్యాధికారిని ఆద్వర్యంలో శానిటైజేషన్ నిర్వహించారు.
అనంతరం కరోనా లక్షణాలు కలిగిన వ్యక్తి యొక్క కుటుంబ సభ్యులు ముగ్గురిని ఐసోలేషన్ కు తరలించారు. స్థానికంగా దుకాణ సముదాయాలను అధికారులు వెంటనే మూయించారు. అదే క్రమంలో కరోనా లక్షణాలు కలిగిన వ్యక్తితో కలిసిన (స్నేహితులు, శ్రేయోబిలాషులు) వ్యక్తులను సైతం అనుమానితులుగా ఐసోలేషన్ కు తరలించారు. చింతపల్లి పాతబస్టాండ్, ఆసుపత్రి ప్రాంతాలను కంటైన్మెంట్ జోన్ గా అధికారులు ప్రకటించారు. కరోనా కలకలం నేపధ్యంలో చింతపల్లి గ్రామం నిర్మానుష్యంగా మారింది.