AP Corona Updates: ఏపీలో కొత్తగా 8,732 కరోనా కేసులు..
AP Corona Updates: ఆంధ్రప్రదేశ్ లో గత కొద్ది రోజులుగా కరోనా కేసులు పెరుగుతున్న సంగతి తెలిసిందే.. తాజాగా గడిచిన 24 గంటల్లో 8,732 కరోనా
AP Corona Updates: ఆంధ్రప్రదేశ్ లో గత కొద్ది రోజులుగా కరోనా కేసులు పెరుగుతున్న సంగతి తెలిసిందే.. తాజాగా గడిచిన 24 గంటల్లో 8,732 కరోనా కేసులు నమోదు అయ్యాయి.. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ బులిటెన్ ని విడుదల చేసింది. తాజా కేసులతో కలిపి రాష్ట్రములో కరోనా కేసుల సంఖ్య 2,81,817 కి చేరుకుంది. ఇందులో 88,138 యాక్టివ్ కేసులు ఉండగా.. ఇప్పటివరకూ 1,91,117 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇక తాజాగా కరోనాతో మరో 87 మంది మృతి చెందారు. దీనితో మృతుల సంఖ్య 2,562 కి చేరుకుంది.
ఇందులో చిత్తూరు జిల్లాలో 10, గుంటూరు జిల్లాలో 9 మంది, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో 8 మంది; అనంతపురం, కడప, కర్నూలు జిల్లాల్లో 7,నెల్లూరు, విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో 6, ప్రకాశం, శ్రీకాకుళం జిల్లాల్లో 5, కృష్ణా జిల్లాలో 3 చొప్పున మరణించారు.
గడిచిన 24 గంటల్లో 53,712 కరోనా శాంపుల్స్ ని పరీక్షించారు. ఇక ఇప్పటివరకూ రాష్ట్రంలో 28,12,197 కరోనా టెస్టులను నిర్వహించింది ఏపీ ప్రభుత్వం.. ఇక జిల్లాల వారిగా కరోనా లెక్కలు చూసుకుంటే.. అత్యధికంగా ఈస్ట్ గోదావరి జిల్లాలో 1126 కేసులు నమోదు అయ్యాయి.. అనంతపురంలో 851, చిత్తూరు లో 959, గుంటూరు 609, కడపలో 389, కృష్ణా జిల్లాలో 298, కర్నూలు జిల్లాలో 734, నెల్లూరు 572, ప్రకాశంలో 489, శ్రీకాకుళంలో 638, విశాఖపట్నంలో 894, విజయయనగరంలో 561, వెస్ట్ గోదావరి జిల్లాలో 612 కేసులు నమోదు అయ్యాయి.