విజయవాడ భవానీ దీక్షా పరులకు కోవిడ్‌ షాక్

* ఈ నెల 5 నుంచి 9 వరకు జరిగే.. * భవానీ దీక్షా విరమణలకు గిరి ప్రదక్షణకు బ్రేక్ * కేశఖండన శాల, నదీ స్నానాలు, జల్లు స్నానాలు నిలుపుదల

Update: 2021-01-03 08:31 GMT

విజయవాడ భవానీ దీక్షా పరులకు కోవిడ్‌ షాక్ ఇచ్చింది. ఈ నెల 5 నుంచి 9 వరకు జరిగే భవానీ దీక్షా విరమణలకు గిరి ప్రదక్షణకు బ్రేక్ పడింది. కేశఖండన శాల, నదీ స్నానాలు, జల్లు స్నానాలు నిలిపివేస్తూ ఆలయ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఇరుముడులు దేవస్థానంకు సమర్పించి వారి వారి స్వగ్రామాల యందు గురు భవానీల సమక్షంలో మాల విరమణ చేయాలని సూచించారు. దీక్షా విరమణ రోజుల్లో రోజుకు పది వేల మందికి మాత్రమే అమ్మవారి దర్శనం అనుమతిస్తున్నట్టు చెప్పారు. స్లాట్ బుక్ చేసుకున్న వారికి మాత్రమే దర్శనం ఉంటుందని తెల్లవారుజామున 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు అమ్మవారి దర్శనం కల్పిస్తున్నట్టు వెల్లడించారు. కోవిడ్‌ దృష్ట్యా అంతరాలయ దర్శనం రద్దు చేసిన అధికారులు పదేళ్లలోపు పిల్లలతో పాటు 60 ఏళ్లు పైబడినవారికి ఆలయంలోని అనుమతిని నిరాకరించారు. 

Tags:    

Similar News