Tirumala Temple: తిరుమలలో మూగబోయిన గుడి గంటలు
Tirumala Temple: కరోనా సెకండ్ వేవ్‌తో గుడిగంటలు మూగబోయాయి.
Tirumala Temple: కరోనా సెకండ్ వేవ్‌తో గుడిగంటలు మూగబోయాయి. భక్తులు లేక తిరుమల పుణ్యక్షేత్రం వెలవెలబోతుంది. ఎవరూ ఊహించని ఉపధృవం కరోనా రూపంలో కుదిపేయడంతో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఆధ్యాత్మిక క్షేత్రం మూగబోయింది.
తిరుమల బోసిపోయింది. మాడ వీధులు సహా మొత్తం ఖాళీగా మారాయి. తిరుమల శ్రీవారిపై కరోనా సెకండ్ వేవ్ ప్రభావం పడింది. దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య భారీగా తగ్గింది. తిరుపతిలో లాక్‌డౌన్ ఆంక్షలు అమలు చేయడం టీటీడీ సిబ్బంది, ఆలయ అర్చకులకు కూడా వైరస్ సోకడంతో భక్తులు స్వామివారి దర్శనానికి వెళ్లేందుకు వెనకడుగు వేస్తున్నారు. దీంతో భక్తులు లేక తిరుమల కొండలు వెలవెలబోతున్నాయి. తిరుమలలో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితి తొలిసారి చూస్తున్నామని తిరుమలవాసులు చెబుతున్నారు.
భక్తులు రాకపోవడంతో శ్రీవారికి హుండీ ద్వారా వచ్చే ఆదాయం కూడా తగ్గుతోంది. గత వారం రోజులుగా చూస్తే భక్తుల రాక భారీగా తగ్గింది. అయితే దర్శనం సంతృప్తికరంగా ఉన్నా ఇలాంటి రోజు మళ్ళీ రావద్దని, తిరుమలగిరులు గోవింద నామస్మరణలతో మారుమ్రోగాలని భక్తులు కోరుకుంటున్నారు. కరోనా అంతమై శ్రీవారి నామస్మరణలతో తిరుమలగిరులు మళ్లీ మార్మోగాలని భక్తులు కోరుకుంటున్నారు.