ఏపీలో విజయవాడ నుంచి టీకా ప్రారంభం
* ఉ.11.25 గం.లకు వ్యాక్సినేషన్‌ను ప్రారంభించనున్న సీఎం జగన్ * రాష్ట్రంలో తొలిదశలో 3.87 లక్షల మందికి టీకా * 32 కేంద్రాల్లో కొవిడ్ వారియర్స్‌కు వ్యాక్సినేషన్
ఏపీలో కోవిడ్ టీకా పంపిణీకి వైద్య ఆరోగ్యశాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 3లక్షల 87వేల 983 మంది ప్రభుత్వ, ప్రైవేటు వైద్యారోగ్య సిబ్బందికి తొలి విడతలో కరోనా వ్యాక్సిన్ అందించనున్నారు. ఇందుకోసం ఏపీ వ్యాప్తంగా 1940 ఆరోగ్య కేంద్రాల్లో తొలి విడత వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగనుంది. మొదటగా కరోనా ఫ్రంట్‌లైన్ వారియర్స్‌కు 332 కేంద్రాల్లో టీకా అందించనున్నారు.
ఇక రాష్ట్రంలో కోవిడ్ వ్యాక్సినేషన్‌ను.. విజయవాడ నుంచి సీఎం జగన్ ప్రారంబించనున్నారు. ఉదయం 11 గంటల 15 నిమిషాలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి11 గంటల 25 నిమిషాలకు జీజీహెచ్‌కు చేరుకోనున్నారు. వ్యాక్సినేషన్ ప్రారంభించిన అనంతరం తిరిగి తాడేపల్లికి చేరుకోనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసింది.