Andhra Pradesh: నెల్లూరు జిల్లాలో సెకండ్ వేవ్ కరోనా ప్రభావం?

Andhra Pradesh: బెంగళూరు నుంచి ఓటు వేసేందుకు వచ్చిన మహిళ ద్వారా పలువురికి కరోనా

Update: 2021-02-25 08:25 GMT

Representational Image

Andhra Pradesh: నెల్లూరు జిల్లాలో మరోసారి కరోనా కలకలం సృష్టిస్తోంది. తాజాగా మళ్లీ కరోనా కేసులు నమోదవ్వడంతో.. సెకండ్ వేవ్ ప్రారంభమయ్యిందనే అనుమానంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇటీవల హైదరాబాద్ నుంచి ఓటు వేసేందుకు వచ్చిన మహిళ ద్వారా.. జిల్లాలో పలువురికి కరోనా సోకినట్టు అధికారులు గుర్తించారు. కోట మండలం విద్యానగర్ లో 5 కేసులు నమోదయ్యాయి. వీరిని హోమ్ క్వారంటైన్ లో ఉంచారు. ఒకే అపార్ట్ మెంట్ లోని ఐదుగురికి కరోనా

నెల్లూరు జిల్లాలో మరోసారి కరోనా భయం పట్టుకుంది. ఇటీవల ముగిసిన పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఇతర జిల్లాల నుంచి వచ్చిన వారి ద్వారా సెకండ్ వెవ్ మొదలైనట్లుగా జిల్లా అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. గూడూరు డివిజన్ పరిధిలోని విద్యానగర్ కు చెందిన ఓ మహిళ తిరుపతి నుంచి వచ్చి ఓటు వేసి వెళ్లింది. దీంతో ఆ గ్రామంలోని పలువురికి కరోనా పాజిటివ్ లక్షణాలు ఉన్నట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు నిర్ధారించారు. వెంటనే అప్రమత్తమైన అధికారులు ముందుజాగ్రత్త చర్యలు చేపట్టారు.

కరోనా పాజిటివ్ లక్షణాలు కలిగిన నలుగురు కుటుంబ సభ్యులను స్థానికంగా హోమ్ కోరెంటైన్ చేశారు. కరోనా నేపథ్యంలో చుట్టుపక్కల ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో అధికార యంత్రాంగం ముందస్తు చర్యలు చేపట్టింది.

మరోవైపు జిల్లాకు వచ్చి వెళ్ళిన తిరుపతికి చెందిన మహిళ కూడా కరోనా పాజిటివ్ ఉన్నట్లు నిర్ధారణ కావడంతో.. ఆమెకు సంబంధించిన సమాచారాన్ని తిరుపతిలోని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలియజేశారు నెల్లూరు జిల్లా అధికారులు.

హైదరాబాద్ నుంచి వచ్చిన ఒక యువతికి కూడా పాజిటివ్ లక్షణాలు ఉన్నట్లు తేలడంతో.. ఆమెను కూడా విద్యానగర్ లోనే హోం క్వారంటైన్ లో ఉంచినట్లు తెలుస్తోంది. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో వీరితో పాటు ఓట్లు వేసిన మిగిలిన వారిలోనూ కరోనా లక్షణాలు ఉండవచ్చని అధికారులు భావిస్తు్న్నారు. అందుకు సంబంధించిన ముందు జాగ్రత్త చర్యలను చేపడుతున్నారు.

Tags:    

Similar News