Guntur Church: గుంటూరు ఈస్ట్ పారిస్‌ చర్చిలో ఫాస్టర్ల ఆధిప్యత పోరు

Guntur Church: జేసుదానం, రవికిరణ్ వర్గాల మధ్య ముదిరిన వివాదం

Update: 2021-08-02 02:15 GMT

గుంటూరు చర్చలో ఆధిపత్య పోరు (ఫైల్ ఇమేజ్)

Guntur Church: గుంటూరులోని ఈస్ట్ పారిస్‌ చర్చిలో కొంతకాలంగా ఫాస్టర్ల మధ్య ఆధిప్యత పోరు నడుస్తోంది. నిన్న వర్గపోరు ఒక్కసారిగా తారాస్థాయికి చేరుకుంది. ప్రార్థనల సమయంలో ఈ చర్చికి తనను ఫాదర్‌గా నియమించారంటూ రవికిరణ్ ఎంట్రీ ఇచ్చారు. దీంతో జేసుదానం, రవికిరణ్ వర్గాల మధ్య వివాదం మొదలైంది. కొట్టుకున్నంత పనిచేశారు. గలాట చూసి ప్రార్థనల కోసం వచ్చినవాళ్లంతా అవాక్కయ్యారు. ఫాదర్‌లు మాత్రం చోద్యం చూస్తూ ఉండిపోయారు. చర్చిలో ఘర్షణ గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని, వివాదాన్ని పరిష్కరించేందుకు ప్రయత్నించారు. కానీ రెండు వర్గాలు ఎవరి మాట వినిపించుకోలేదు. తప్పంతా మీదేనంటూ పరస్పరం ఆరోపణలు చేసుకున్నారు. పరిస్థితి చేయి దాటకుండా పోలీసులు మోహరించారు.

Tags:    

Similar News