చిత్తూరులో విద్యార్థులను మోసం చేసిన రైట్ చాయిస్ కోచింగ్ సెంటర్
Chittoor: ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల్లో పాస్ చేయిస్తానని డబ్బులు వసూలు
Chittoor: చిత్తూరులో రైట్ చాయిస్ కోచింగ్ సెంటర్ బోర్డు తిప్పేసింది. ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల్లో పాస్ చేయిస్తానని సుమారు 200 మంది విద్యార్థుల నుంచి డబ్బులు వసూలు చేశారు నిర్వాహకులు. అయితే బోర్డు తిప్పేయడంతో కోచింగ్ సెంటర్ నిర్వాహకుడ్ని స్టూడెంట్స్ నిర్భంధించారు. మిట్టూరులోని కోచింగ్ సెంటర్‌లో విద్యార్థులు ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. అయితే పోలీసులమని చెప్పి కోచింగ్ సెంటర్ నిర్వాహకుడ్ని అతని అనుచరులు తీసుకెళ్లారని విద్యార్థులు చెబుతున్నారు.