తిరుపతి గంగమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన సీఎం జగన్
తిరుమల పర్యటనకు బయల్దేరిన సీఎం వైఎస్ జగన్
CM Jagan: సీఎం జగన్ తిరుమలలో పర్యటిస్తున్నారు. మొదట తిరుపతి తాతయ్యగుంట ప్రాంతంలోని గంగమ్మ ఆలయాన్ని సందర్శించారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సీఎం రాకతో గంగమ్మ ఆలయం వద్ద భారీ కోలాహలం నెలకొంది. ఆలయాధికారులు సీఎం జగన్‌కు తీర్థప్రసాదాలు అందజేశారు. అనంరతరం సీఎం జగన్ అలిపిరి చేరుకుని విద్యుత్ బస్సులను ప్రారంభించారు. ఎలక్ట్రిక్ బస్సులను పచ్చజెండా ఊపి ప్రారంభించారు. ఈ విడతలో మొత్తం 10 ఎలక్ట్రిక్ బస్సులు భక్తులకు అందుబాటులోకి రానున్నాయి. తిరుమల కొండపైకి చేరుకున్న సీఎం జగన్ ముందుగా బేడీ ఆంజనేయస్వామిని దర్శించుకున్నారు. తిరుమల వెంకన్నకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పిస్తారు. స్వామివారి దర్శనం అనంతరం రాత్రికి తిరుమలలోనే సీఎం జగన్ బస చేయనున్నారు.