గోదావరి వరదలు, సహాయ కార్యక్రమాలపై సీఎం జగన్ సమీక్ష
*మరో 24 గంటలపాటు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సీఎం ఆదేశం
CM Jagan: గోదావరి వరదలు, సహాయ కార్యక్రమాలపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. వరదల ఎఫెక్ట్‌పై ముఖ్యమంత్రి అధికారులతో మాట్లాడారు. గోదావరి వరద ప్రవాహం, తాజా పరిస్థితులపై సీఎం ఆరా తీశారు. బాధితుల తరలింపుపై సీఎంకు అధికారులు వివరాలు అందించారు. ఎక్కడా కూడా ప్రాణనష్టం ఉండకూడదని అధికారులను సీఎం ఆదేశించారు.
అవసరమైనంత మేర సహాయక బృందాలను వినియోగించుకోవాలని సీఎం సూచించారు. మరో 24 గంటలపాటు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సీఎం అధికారులకు సూచించారు. బాధిత కుటుంబాలకు రేషన్ బియ్యంతో పాటు నిత్యావసర సరుకులను కూడా పంపిణీ చేయాలని సీఎం ఆదేశించారు. శిబిరాల్లో ఉన్నవారికి 2వేలు అందించాలన్నారు.