CM Jagan:కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రికి సీఎం జగన్ లేఖ

CM Jagan:ఉక్రెయిన్‌లో ఉన్న ఏపీ విద్యార్థులను.. క్షేమంగా భారత్‌కు తీసుకురావాలని విజ్ఞప్తి

Update: 2022-02-24 01:22 GMT

కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రికి సీఎం జగన్ లేఖ

CM Jagan: ర‌ష్యా, ఉక్రెయిన్‌ల మ‌ధ్య యుద్ధ వాతావర‌ణం నెల‌కొన్న నేప‌థ్యంలో ఉక్రెయిన్‌లో ఉంటున్న భార‌తీయుల‌ను సుర‌క్షితంగా దేశానికి త‌ర‌లించే ప‌నిని కేంద్రం ఇప్పటికే చేప‌ట్టింది. ఈ నేప‌థ్యంలో ఉక్రెయిన్‌లో చ‌దువుకుంటున్న ఏపీ విద్యార్థులను సుర‌క్షితంగా రాష్ట్రానికి తీసుకురావ‌డానికి ఏపీ సీఎం జ‌గ‌న్ చ‌ర్యలు ప్రారంభించారు. ఈ మేర‌కు కేంద్ర విదేశీ వ్యవ‌హారాల మంత్రికి జగన్ లేఖ రాశారు. ఉక్రెయిన్‌లో ఉంటున్న ఏపీ విద్యార్థుల‌ను సుర‌క్షితంగా రాష్ట్రానికి తీసుకురావాల‌ని లేఖ‌ ద్వారా కోరారు. ఈ విష‌యంలో ఏపీ నుంచి ఎలాంటి స‌హ‌కారం అందించ‌డానికైనా తాము సిద్ధంగా ఉన్నామ‌ని కూడా జ‌గ‌న్ స్పష్టం చేశారు. ఉక్రెయిన్‌లోని ఏపీ విద్యార్థుల‌ను త‌క్షణ‌మే సుర‌క్షితంగా వారి స్వస్థలాల‌కు చేర్చాల‌ని జ‌గ‌న్ కోరారు.

Tags:    

Similar News