Kurnool: గుమ్మటంలో విద్యుత్ ప్రాజెక్టుకు సీఎం జగన్ శంకుస్థాపన
Kurnool: ఒకే యూనిట్ నుంచి సోలార్, విండ్, హైడల్ పవర్ ఉత్పత్తి
Kurnool: ప్రపంచానికే వెలుగు అదించటానికి కర్నూలు సన్నద్ధం అయింది. అరుదైన విద్యుత్ ప్రాజెక్ట్ కు సీఎం జగన్ శంకుస్థాపన చేసారు. దీని వల్ల విద్యుత్ సమస్యలు తీరిపోనున్నాయని స్పష్టం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఓ సంచలనం మొదలు అయింది. ప్రపంచంలో అత్యంత భారీ విద్యుత్ ప్రాజెక్ట్ ఏర్పాటు కాబోతోంది. కర్నూలు జిల్లా ఓర్వకల్ మండలం గుమ్మటంలో గ్రీన్ కో ఎనర్జీ లిమిటెడ్ ఏర్పాటు చేస్తున్న విద్యుత్ ప్రాజెక్ట్ కు సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. విద్యుత్ తో పాటు పునర్ విద్యుత్ ఇంధన ప్రాజెక్ట్ గా ఇది ఏపీలో ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకోనుంది.
ఒకే యూనిట్ నుంచి సోలార్, విండ్, హైడల్ పవర్ ఉత్పత్తి చేసే సామర్థ్యం దీనికి వుంది. సోలార్ ద్వారా సుమారు మూడు వేల మెగావాట్లు, విండ్ ద్వారా 5వేల 550 మెగావాట్ల విద్యుత్ సరఫరా చేస్తుంది. మరోవైపు హైడల్ పవర్ ద్వారా 1,680 మెగావాట్ల విద్యుత్ వినియోగించుకునే అవకాశం వస్తుంది. ఓర్వకల్ P.G.C.I.Lతో పాటు C.T.U విద్యుత్ సబ్ స్టేషన్ల ద్వారా ఈ విద్యుత్ సబ్ స్టేషన్ల కు అందుతుంది. ఓర్వకల్ P.G.C.I.L, C.T.U విద్యుత్ సబ్ స్టేషన్ల ద్వారా దేశం మొత్తం ఈ విద్యుత్ వెలుగులు అందుతాయి.
ఈ ప్రాజెక్ట్ నిర్మాణం కోసం వచ్చే ఐదేళ్లలో నిర్మాణాత్మక విధానంతో పూర్తి చేస్తారు. దీనికోసం ప్రభుత్వం 4,766.28 ఎకరాలు భూమి కేటాయించి పనులు అప్పగించింది. ఇంటిగ్రేటెడ్ రెన్యువబుల్ ఎనర్జీ ప్రాజెక్టు కోసం గ్రీన్కో ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ 15 వేల కోట్లు పెట్టుబడి పెట్టింది. ఇది కర్నూలు జిల్లాలో తొలి హైడల్ ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ వల్ల ప్రతి ఏటా 15 వేల కార్బన్ డయాక్సడ్ తగ్గుతుందని అంచనా వేస్తున్నారు.
గుమ్మిటం తాండ నుండి రాయలసీమకు మంచి రోజులు వచ్చాయని నేతలు అభిప్రాయ పడుతున్నారు. అనేక రకాల విద్యుత్ ఉత్పత్తి తో పాటు అనేక విధాలుగా ఈ ప్రాజెక్ట్ ఉపయోగపడుతుందని స్వయంగా ముఖ్యమంత్రి భరోసా ఇస్తున్నారు. ఏపీలో ఈ ప్రాజెక్ట్ ఓ ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అందులోనూ సీమతో పాటు దేశ వ్యాప్తంగా ఉపయోగంగా వుండే ప్రాజెక్ట్ కు సీఎం శంకుస్థాపన చేయటం..కర్నూలు అభివృద్ధికి ఇది ఓ సోపానం.