Andhra Pradesh: త్వరగా ఎన్నికలు పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలి- జగన్
Andhra Pradesh: ప్రధానితో వీడియో కాన్ఫరెన్స్ అనంతరం రాష్ట్ర అధికారులతో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు.
Andhra Pradesh: ప్రధానితో వీడియో కాన్ఫరెన్స్ అనంతరం రాష్ట్ర అధికారులతో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. వ్యాక్సినేషన్ ప్రక్రియకు ఎన్నికలు భంగంగా మారాయన్నారు సీఎం. త్వరగా మిగిలిపోయిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని తెలిపారు. లేదంటే కంటైన్‌మెంట్ జోన్ల ఏర్పాటు కరోనా టెస్టులు చేయడం కష్టంగా మారుతుందని గవర్నర్‌కు, హైకోర్టుకు ప్రభుత్వం తరపున ఈ విషయాల్ని నివేదించాలని సూచించారు.
ఇక వ్యాక్సినేషన్ ప్రక్రియ ఉధృతం చేసేందుకు గ్రామ సచివాలయాలను యూనిట్‌గా తీసుకోవాలన్నారు సీఎం. వ్యాక్సినేషన్ పూర్తిచేయడంపై దృష్టిపెట్టి లక్ష్యాన్ని చేరుకోవాలని ఆదేశించారు. 45 ఏళ్లు పైబడిన వారు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి త్వరగా వ్యాక్సిన్లు అందించాలన్నారు సీఎం జగన్. నూటికి నూరు శాతం ఆర్టీపీసీఆర్ టెస్టులు జరిగేలా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.