రామతీర్ధం సంఘటనా స్థలాన్ని సీఐడీ అడిషనల్ డీజీ సునీల్ కుమార్ పరిశీలించారు. రామతీర్థం ఘటన జరిగిన విధానం చూస్తుంటే ఎవరో కావాలనే చేసినట్టు ఉందని ఆయన తెలిపారు. లబ్ది కోసం.. కక్ష కోసం దాడులు చేస్తారని చెప్పారు. ప్రభుత్వంపై కక్షతోనే ఈ ఘటనకు పాల్పడ్డారని తెలిపారు. తలను ఖండించడానికి ఉపయోగించిన రంపం దొరికిందన్నారు. చాలా ఆదారాలు సేకరించామని పేర్కొన్నారు. రాజకీయాలు చేయడానికే ఘటనకు పాల్పడ్డారన్నారు. నిష్పక్షపాతంగా దర్యాప్తు జరుగుతుందని దోషులను వెంటనే పట్టుకుంటామని సీఐడీ అడిషనల్ డీజీ సునీల్ కుమార్ చెప్పారు.