SP Rishanth Reddy: అడ్మిషన్లు పెంచేందుకే లీకేజీలు..
SP Rishanth Reddy: టెన్త్ పేపర్ లీకేజ్ కేసులో, తమ విచారణలో వివరాల ఆధారంగా మాజీ మంత్రి నారాయణను అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు చిత్తూరు ఎస్పీ
SP Rishanth Reddy: టెన్త్ పేపర్ లీకేజ్ కేసులో, తమ విచారణలో వివరాల ఆధారంగా మాజీ మంత్రి నారాయణను అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు చిత్తూరు ఎస్పీ రిశాంత్ రెడ్డి . టెన్త్ పేపర్ లీక్ కేసులో మాజీ మంత్రి, నారాయణ విద్యాసంస్థల అధిపతి నారాయణను మంగళవారం పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు చిత్తూరు ఎస్పీ మంగళవారం ప్రెస్‌మీట్ నిర్వహించారు.
నారాయణ స్కూళ్లలో అడ్మిషన్లు పెంచేందుకే పేపర్ లీక్ చేశారని ఎస్పీ రిశాంత్ రెడ్డి తెలిపారు. ప్రణాళిక ప్రకారమే మాల్ ప్రాక్టీస్ చేశారని చెప్పారు. పట్టుబడిన నిందితుల వాంగ్మూలం మేరకు మిగతా అరెస్ట్‌లు ఉంటాయన్నారు. అదేవిధంగా ఇతర విద్యాసంస్థల పాత్రపై కూడా విచారణ జరుగుతున్నట్లు చెప్పారు ఎప్పీ రిశాంత్ రెడ్డి.