అమరావతిలో నేడు పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ..టిడ్కో ఇళ్లను కూడా అందజేయనున్న జగన్‌ ప్రభుత్వం

Amaravati House Sites: 50,793 మంది పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ

Update: 2023-05-26 05:00 GMT

అమరావతిలో నేడు పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ..టిడ్కో ఇళ్లను కూడా అందజేయనున్న జగన్‌ ప్రభుత్వం

Amaravati House Sites: ఏపీ సర్కార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అమరావతి ప్రాంతంలో పేద ప్రజలకు ఇళ్ల పట్టాల పంపిణీకి సంబంధించి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఇవాళ సీఎం జగన్ లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేయనున్నారు. వెంకటపాలెం సీడ్ యాక్సిస్ రోడ్డు పక్కన ఉన్న వేంకటేశ్వర స్వామి దేవాలయం దగ్గర భారీ బహిరంగ సభ ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ సభకు 50 వేల మంది లబ్ధిదారులు, వారి కుటుంబ సభ్యులు కలిపి మొత్తంగా సుమారు రెండు లక్షల మంది వస్తారని అధికార యంత్రాంగం అంచనా వేస్తోంది. ఇందుకు అనుగుణంగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాలకు చెందిన 50 వేల 392 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు ఇవ్వనున్నారు. వీటిలో ఎన్టీఆర్ జిల్లాకు కేటాయించిన 741.93 ఎకరాల్లో 14 లే అవుట్లు వేశారు. వీటిని 27వేల 532 మంది లబ్ధిదారులకు అందించనున్నారు. గుంటూరు జిల్లాకు కేటాయించిన 650 ఎకరాల్లో 11 లే అవుట్లు వేసి అభివృద్ధి చేశారు. వీటిని 23వేల 860 మందికి ఇవ్వనున్నారు. ఇదే వేదికపై నుంచి అమరావతి ప్రాంతంలోని 5వేల 24 టిడ్కో ఇళ్ల పంపిణీ కూడా చేపట్టనున్నారు. అమరావతి పరిధిలో మొత్తం 1402.58 ఏకరాల్లో 25 లే అవుట్లు వేసి అభివృద్ధి పనులు చేపట్టారు.

ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని అమరావతి జేఏసీ వ్యతిరేకిస్తోంది. ఇళ్ల పట్టాల పంపిణీ నేపథ్యంలో ఇవాళ నిరసనకు పిలుపునిచ్చింది. దీంతో పోలీసులు 144 సెక్షన్‌ విధించారు. అలాగే, భారీ పోలీస్ భద్రతను ఏర్పాటు చేశారు. సీఎం జగన్ స్వయంగా పట్టాల పంపిణి చేస్తుండటంతో ఎక్కడా నిరసనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

Tags:    

Similar News