కడప జిల్లాలో మునిసిపల్ అధికారులపై ఛీటింగ్ కేసు నమోదు...

Kadapa: బెయిలుపై విధులు నిర్వహిస్తున్న బద్వేలు మునిసిపల్ కమిషనర్ కృష్ణారెడ్డి...

Update: 2022-04-06 08:20 GMT

కడప జిల్లాలో మునిసిపల్ అధికారులపై ఛీటింగ్ కేసు నమోదు...

Kadapa: విధినిర్వహణలో బాధ్యతను విస్మరించి అవినీతికి పాల్పడితే ఎక్కడున్నా శిక్ష తప్పదని చట్టాలు హెచ్చరించాయి. కడప జిల్లాలో మునిసిపల్ అధికారులు అవినీతిపై ఫిర్యాదుతో విచారించిన అధికారులు క్రిమినల్ కేసులు నమోదు చేశారు. ఆరేళ్లక్రితం అవినీతికి పాల్పడిన కేసులో రిటైర్డయిన తర్వాత కొందరు... విధినిర్వహణలో ఉన్న మరికొందరిపై కేసులు నమోదయ్యాయి. దీంతో మైదుకూరు మునిసిపల్ కమిషనర్‌గా పనిచేస్తూ... పదవీవిరమణచేసిన శ్రీనివాసులురెడ్డిని, అసిస్టెంట్ ఇంజినీరు నరసింహులును అరెస్టుచేశారు.

ఇదే తరహాకేసులో నిందితులుగా ఉన్న బద్వేల్ మునిసిపల్ కమిషనర్ కృష్ణారెడ్డి, అప్పటి డిప్యూటీ ఇంజినీరు విశ్వనాథ్ బెయిలుపై బయటకొచ్చి విధులు నిర్వహిస్తున్నారు. మైదుకూరు మునిసిపాలిటీ లింగాలదిన్నెలో పనులు చేయకుండానే... 71 లక్షలరూపాయలమేర నిధులు స్వాహాచేశారనే ఫిర్యాదుతో ఉన్నతాధికారులు విచారించి క్రిమినల్ కేసులు నమోదు చేయమని ఆదేశాలు జారీచేశారు. దీంతో మునిసిపల్ కమిషనర్ రాముడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితులపై వివిధ సెక్షన్లపై కేసులు నమోదు చేశార.

Tags:    

Similar News