ఏలూరు కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశంలో గందరగోళం
*ఉమామహేశ్వరరావు నుంచి మైక్ లాక్కోవడంతో సభలో గందరగోళం
Eluru Corporation Council: ఏలూరు కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశం రసాబాసగా మారింది. ముందస్తు అనుమతులతో చేసిన పనులపై సమావేశంలో చర్చించాలని కార్పొరేటర్ పప్పు ఉమామహేశ్వరరావు పట్టుబట్టారు. దీంతో ఆమెను అధికార పార్టీ కార్పొరేటర్లు అడ్డుకోవడంతో గందరగోళం నెలకొంది. సమావేశం అజెండాలో 1 నుంచి 7 అంశాలపై ఉమా మహేశ్వరరావు ప్రశ్నిస్తుండగా కోఆప్టెడ్ సభ్యుడు గుడివాడ రామచంద్ర కిషోర్ ఆయన దగ్గరి నుంచి మైక్ లాక్కోగా మరో కో ఆప్టెడ్ మెంబర్ పెదబాబు ఉమామహేశ్వర్ రావును అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో అక్కడ కొంత సేపు గందరగోళం నెలకొంది. ఇదిలా ఉంటే మేయర్ నూర్జహాన్ దంపతులపై కూడా పలు ఆరోపణలు చేయటంతో గతంలోనే ఉమాను వైసిపి నుంచి సస్పెండ్ చేసారు. తాజాగా సమావేశంలోనూ అతని తీరు బాగోలేకపోవడం వల్లే అడ్డుకున్నట్లు వైసీపీ కార్పొరేటర్లు చెబుతున్నారు.