Chandrababu Naidu: సీఎం హోదాలో తొలిసారి కుప్పం వెళ్లనున్న చంద్రబాబు
Chandrababu Naidu: ఈ నెల 23, 24 తేదీలలో కుప్పంలో పర్యటన
Chandrababu Naidu: ముఖ్యమంత్రి హోదాలో నారా చంద్రబాబునాయుడు తొలిసారి కుప్పం పర్యటనకు వెళ్లనున్నారు. ఈనెల 25, 26వ తేదీల్లో ఆయన పర్యటన దాదాపు ఖరారైంది. ఈనెల 23, 24 తేదీలలో శాసనసభ సమావేశాలు ముగిసిన అనంతరం తన సొంత నియోజకవర్గమైన కుప్పంలో రెండు రోజులపాటు పర్యటించనున్నారు. కుప్పం నుంచి వరుసగా 8 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన చంద్రబాబు, నాల్గోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటిసారిగా కుప్పంలో పర్యటించనున్న టీడీపీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రికి టీడీపీ వర్గాలు ఘన స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు ప్రారంభించాయి.
తాజాగా అసెంబ్లీ విజయంతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం పొంగిపొర్లుతోంది. అదే సమయంలో ప్రభుత్వ అధికారుల్లో కొందరికి గుబులు పుడుతోంది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీ నేతలకు తొత్తులుగా వ్యవహరించిన వివిధ ప్రభుత్వ విభాగాల అధికారులు ఇంకా ఆ కీలక పదవుల్లో ఉన్నారు. అటువంటి వారు ముఖ్యమంత్రి రాకపట్ల ఆందోళనగా ఉన్నారు. ప్రభుత్వ యంత్రాంగంతో పాటు వ్యవహారాలపై పూర్తిస్థాయి పట్టున్న చంద్రబాబు నాయుడు ఈ అవకతవకల గురించి, ఎటువంటి అవినీతి చర్యల గురించి ప్రశ్నిస్తారో, ఏమి సమాధానం చెప్పాలో అన్న భయం వారిలో కనిపిస్తోంది.
ఈ నెల 25, 26 తేదీల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుప్పం పర్యటన ఖరారైనా, ఏ కార్యక్రమాల్లో పాల్గొంటారనే విషయంలోపూర్తి స్థాయి స్పష్టత లేదు. టీడీపీ శ్రేణులు, కార్యకర్తలతో ముఖాముఖిగా పాల్గోనున్నారని తెలుస్తోంది. కుప్పంలో బహిరంగ సభ నిర్వహించాలన్న యోచనలో స్థానిక పార్టీ యంత్రాంగం ఉంది. కుప్పంలో సీఎం బస చేయనున్న ఆర్‌అండ్‌బీ అతిథి గృహ ఆధునికీకరణ పనులను అధికారులు చేపట్టారు.