Pawan Kalyan : చంద్రబాబు అనుభవం ఏపీకి చాలా అవసరం

Pawan Kalyan :కూటమి విజయం దేశానికి స్ఫూర్తినిచ్చింది

Update: 2024-06-11 07:53 GMT

Pawan Kalyan : చంద్రబాబు అనుభవం ఏపీకి చాలా అవసరం

Pawan Kalyan : ఎన్డీయే కూటమి తరపున ఏపీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా చంద్రబాబు పేరును జనసేన పార్టీ నుండి పవన్ కల్యాణ్ బలపరిచారు. విజయవాడలో కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కల్యాణ్ ప్రసంగించారు. ఉమ్మడి మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలను బాధ్యతగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని అన్నారు. ఇలాంటి సమయంలో సుదీర్ఘ అనుభవం ఉన్న నాయకుడు కావాలని, నాలుగు దశాబ్దాల అనుభవం, అభివృద్ధిపై అపారమైన అవగాహన, పెట్టుబడులను తీసుకొచ్చే సమర్థత, ప్రతిభ, విదేశాల అధ్యక్షులను తెలుగు రాష్ట్రాల వైపు దృష్టి మళ్లించే శక్తి ఉన్న చంద్రబాబు నాయకత్వం రాష్ట్రానికి చాలా అవసరం పేర్కొన్నారు.

ఎన్డీయే కూటమి విజయం దేశం మొత్తానికి స్ఫూర్తినిచ్చిందని పవన్ కల్యాణ్ అన్నారు. చంద్రబాబుకు మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు చెబుతున్నా అద్భుతమైన పాలన అందివ్వాలని కోరుకుంటున్నానిని చెప్పారు. ఈ సందర్భంగా పవన్‌ను చంద్రబాబు ఆలింగనం చేసుకుని ధన్యవాదాలు తెలిపారు.

Tags:    

Similar News