Bay of Bengal: బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పాడే ఛాన్స్
Bay of Bengal: ఒడిశా సముద్రమట్టం నుంచి 2.1 నుంచి 3.6 కి.మీ ఎత్తులో ఆవర్తనం
Bay of Bengal: ఇవాళ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పాడే ఛాన్స్ ఉందని విశాఖ వాతావరణశాఖ తెలిపింది. దాంతో ఏపీలోని ఉత్తరకోస్తా తీర ప్రాంతం మీదుగా ఉపరితల ద్రోణి ఏర్పాడింది. ఒడిశా పరిసర ప్రాంతాల్లో సముద్రమట్టం నుంచి 2.1 నుంచి 3.6 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని ప్రకటించింది. దీని ప్రభావంతో పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దాన్ని ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పాడనుందని వాతావరణ వెల్లడించింది.
అల్పపీడన ప్రభావంతో కోస్తాంధ్ర జిల్లాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే చాన్స్ ఉందని తెలిపింది. అల్పపీడనం ప్రభావంలో సముద్రం అల్లాకల్లోలంగా మారనుందని పేర్కొంది. తీరం వెంబడి గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీయనున్నాయి. ఈనెల 13 వరకు మత్స్యకారులు వేటకు వెళ్లరాదని వాతావరణశాఖ వెల్లడించింది.