CM Jagan: ఏపీ సీఎం జగన్‌తో కేంద్ర బృందం భేటీ
CM Jagan: వరద ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితిని వివరించిన బృందం
CM Jagan: ఏపీ సీఎం జగన్‌తో కేంద్ర బృందం భేటీ అయ్యింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితిని జగన్‌కు వివరించింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నర చర్యలను కేంద్ర బృందం ప్రశంసించింది. కేంద్ర బృందం తరపు కునాల్ సత్యార్థి సీఎం జగన్‌కు వివరాలు వెల్లడించారు. వరదల వల్ల పెద్ద ఎత్తున పంటలు కొట్టుకుపోయాయని వీలైనంత వరకు ఆదుకునేందుకు సహకారం అందిస్తామని తెలిపారు.
వరద నష్టాన్ని అంచనా వేసేందుకు రాష్ట్రానికి వచ్చిన కేంద్ర బృందానికి సీఎం జగన్ కృతజ్ఞతలు తెలిపారు. ధాన్యం కొనుగోలులో నిబంధనలు సడలించాలని కేంద్ర బృందాన్ని కోరారు. నష్టం అంచనాల తయారీకి క్షేత్రస్థాయిలో సమర్థవంతమైన వ్యవస్థ ఉందన్నారు. ప్రతి గ్రామంలో ఆర్‌బీకే ఉందని రైతు పండించిన పంట ఈ క్రాప్‌లో నమోదు చేస్తున్నట్లు తెలిపారు. వరద నీటిని తరలించడానికి ఇప్పుడున్న కాల్వల సామర్థ్యాన్ని పెంచేలా కార్యక్రమం చేపట్టామన్నారు.